Mallikharjuna Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఫిక్స్? ప్రకటించడమే తరువాయి

Mallikharjuna Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనే దానిపై గత నెల రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. దేశ రాజకీయాల్లో ఈ అంశం ఉత్కంఠకరంగా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి అంటే మాములు విషయం కాదు.. దేశాన్ని 60 ఏళ్లకుపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అంటే ఎంతోమంది గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టీలో వారికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దీంతో ఆ పదవి కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అధ్యక్ష పదవికి భారీగా పోటీ నెలకొంది. చాలామంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ నేతలు పోటీలోకి దిగుతున్నారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు బాగా రేసులో వినిపిస్తోంది. సోనియాగాంధీ స్వయంగా ఆయనను పిలిచి పోటీ చేయాలని సూచించడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవి అశోక్ గెహ్లాట్ కు దక్కుతుందని అందరూ భావించారు. ఇక శశిధరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ మల్లిఖార్జన ఖర్గే పోటీలోకి దిగడంతో దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం శశిధరూర్, మల్లిఖార్జున ఖర్గే మాత్రమే రేసులో ఉన్నారు.

ఇక మహారాష్ట్రకు చెందని ముస్నిక్ వాసిక్ కూడా నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు వార్తల వస్తున్నాయి. కానీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే పనిచేశారు. దీంతో అన్ని పార్టీల నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి పేరు ఉంది. పార్టీలో కూడా సీనియర్ నేతగా ఆయన ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యత నమ్మకస్తుడిగా ఆయన ఉన్నారు. దీంతో మల్లిఖార్జున ఖర్గేకు అధ్యక్ష పదవి దక్కడం ఖాయమని చెప్పవచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది.

నేటితో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కేవలం మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఠాగూర్ మాత్రమే నామినేషన్లు వేశారు. శశిథరూర్ కంటే మల్లిఖార్జున ఖర్గేకే ఎక్కువమంది నేతల సపోర్ట్ ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల అండదండలు కూడా ఆయనకే ఉన్నాయి. దీంతో మల్లిఖార్జున ఖర్గేనే అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. 1999, 2004, 2013 ఎన్నికల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని సామాజికవర్గాల సమీకరణాల దృష్ట్యా ఆ పదవి తృటిలో కోల్పోయారు. దళిత సామాజివకర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -