Manchu Vishnu: విడుదల కాకుండానే జిన్నా సినిమాపై దుష్ప్రచారం.. ఆ యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడిన విష్ణు!

Manchu Vishnu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఈ ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీ గురించి నెగటివ్ కామెంట్లతో ట్రోల్ చేసే వారి గురించి మంచు ఫ్యామిలీ ఇప్పటికే సీరియస్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.అయితే మంచు కుటుంబం నుంచి ఏ సినిమా రాబోతున్న ఆ సినిమా విడుదల కాకుండానే పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంటారు.

ఇదివరకే మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది.ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా నటించిన జిన్నా సినిమా విషయంలో కూడా ఈ సినిమా విడుదల కాకుండానే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారంటూ మంచు విష్ణు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ యూట్యూబ్ ఛానల్ పేర్లను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

తాను ఊహించిందే జరిగింది ఇదిగో పెయిడ్ బ్యాచ్.. జిన్నా సినిమా విడుదల కాకముందే నెగిటివ్ రివ్యూ రాయడం మొదలుపెట్టారు. మా సినిమాలంటే ఎందుకింత ద్వేషం? త్వరలోనే ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని మూసేసుకోవాల్సి వస్తుంది సిద్ధంగా ఉండండి అంటూ ఈ సందర్భంగా విష్ణు ఆ యూట్యూబ్ ఛానల్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ విధంగా మంచు కుటుంబం పై ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో ఇలా అందరిని రెచ్చగొడుతూ తమ కుటుంబం పై దుష్ప్రచారం చేసే పనిలో ఉన్నారంటూ తరచూ విష్ణు ఆ హీరో పై పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన సినిమా ఇంకా విడుదల కాకుండానే సినిమాపై దుష్ప్రచారం చేయడంలో కూడా ఆ హీరో ప్రమేయం ఉంది అంటూ ఈయన పరోక్షంగా వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -