Manchu Vishnu: విష్ణుకు బిల్డింగ్ కట్టే ఆలోచన లేదా.. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా?

Manchu Vishnu: తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరో మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలో నటించి నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు విష్ణు. ఇక కొంతకాలంగా సినిమాలు దూరంగా ఉంటున్న విష్ణు జిన్నా సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో మంచి విష్ణు ఒక రేంజ్ లో ట్రోల్స్ కు గురవుతున్నాడు.

మరి ఇన్ని ట్రోల్స్ గురవుతున్న మంచు విష్ణు జిన్నా సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇదంతా పక్కన పెడితే అక్టోబర్ 10వ తేదీకి మంచు విష్ణు మా అధ్యక్షుడు పదవి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తి అవనున్నది. ఈ నేపథ్యం లో మంచు విష్ణు మా గురించి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు బయట పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో మా ఎన్నికల్లోనే కాదు ఏ ఎన్నికల్లో పాల్గొనని తెలిపాడు.

జనరల్ ఎలక్షన్ లతో సమానంగా మా ఎలక్షన్ లో పోటీ చేసిన మంచు విష్ణు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమిటి అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. మా పదవిపై విసుగు పుట్టిందా అని కొందరు ఆలోచిస్తున్నారు. మరి సొంత డబ్బుతో కట్టిస్తానన్న మా భవనం సంగతి ఏమిటి? అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. 25 ఏళ్లుగా ఒక ఇంచుకూడా కదలని మా భవనం గురించి.. సొంతంగా నిర్మిస్తానని మంచు విష్ణు మాట ఇచ్చారు. మరి ఈ మా భవనం పరిస్థితి ఏమిటని కొందరు అడుగుతున్నారు.

ఇక విష్ణు ఇప్పటికే భవనం నిర్మాణం చేపట్టామని కొన్ని వేదికలపై తెలిపాడు. దీంతో విష్ణు ఎలాగైనా మా భవన నిర్మాణాన్ని సాధిస్తాడని చాలా మంది నమ్మారు. ఇప్పుడు ఇలా విష్ణు మాట్లాడుతుంటే ఎవరు అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారు. ఇక మంచు విష్ణు కి బిల్డింగ్ కట్టించే ఆలోచన లేదు.. అందుకే మా గురించి ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు అని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి విష్ణు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -