Prabhas: మంచు విష్ణు సినిమాలో నటిస్తే ప్రభాస్ కు మరో ఫ్లాప్ గ్యారంటీ.. ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ ఇదే!

Prabhas: మంచు విష్ణు సినిమాకు ఓకే చెప్పి ప్రభాస్ అతిపెద్ద తప్పు చేశాడని కొంతమంది కామెంట్లు చేశారు. ఈ సినిమాతో ప్రభాస్ కు మరో ఫ్లాప్ చేరుతుందని వాళ్లు చెబుతున్నారు. మోహన్ బాబు, మంచు విష్ణు కలిపి కన్నప్ప అనే ఒక పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ మూవీ గురించి చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

దీని మీద ఈమధ్య చాలా రూమర్స్ వస్తున్నాయి. అందులో ప్రభాస్ మహా శివుడు పాత్రలో కనిపిస్తున్నారు అని సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది. మంచు విష్ణు ఈ పాత్రకి ప్రభాస్ ని అడగగా ప్రభాస్ ఒప్పుకున్నారు అని తెలుస్తుంది.ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటివరకు ఉన్న ఫ్లాప్స్ స్ట్రీక్ ప్రభాస్ కి మళ్ళీ కొనసాగుతుంది అనే చెప్పాలి. ఎందుకంటే మంచు విష్ణు తో సినిమా అంటే అక్కడ జరిగే సాహసాలు అందరికీ తెలిసినవే.

తన సినిమా గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడో పది సినిమాలకి ఒక హిట్ దొరకడం కూడా సాహసమనే చెప్పాలి. అలాంటి మంచు విష్ణుతో ప్రభాస్ సినిమా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ గుండెల్లో భయం మొదలవుతుంది. అసలుకే హిట్లు లేక అసంతృప్తి చెందుతున్న ప్రభాస్ ఫ్యాన్లకు ఇది మరొక పెద్ద నిరాశగా మిగులుతుంది. గతంలో కృష్ణంరాజు ప్రభాస్ చేత కన్నప్ప పాత్రలో సినిమా తీస్తాను అని ఆశ పడుతున్నాను అని చెప్పారు.

బహుశా తన పెదనాన్న ఆశ తీర్చడం కోసమే ఈ సినిమా ఒప్పుకున్నారేమో. ఏది ఏమైనా సరే ప్రస్తుతం ప్రభాస్ ని ఇలాగ చూడడం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇబ్బందిగా ఉంది. సలార్ పోస్ట్పోన్ న్యూస్ నిజమో కాదో తెలియక ఒకవైపు బాధపడుతుంటే మరోవైపు ఇలాంటి విషయాలు వచ్చి దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి ప్రభాస్ ఫ్యాన్స్ కు. అసలు నిజమేంటో అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -