Mangalagiri Constituency: మంగళగిరిలో అభ్యర్థిని మళ్లీ మళ్లీ మారుస్తున్న జగన్.. లోకేశ్ గెలుస్తాడనే భయమే కారణమా?

Mangalagiri Constituency: ఎన్నికల సమీపిస్తున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారని తెలుస్తుంది. ఈయన ముందు ఒకరి పేర్లు ప్రకటించి తిరిగి మరికొందరి పేర్లను ప్రకటిస్తున్నారు. ఇలా మళ్లీ మళ్లీ పేర్లను మార్చడం వెనుక జగన్ ఉద్దేశం ఏంటి ఇలా ఈయన అభ్యర్థులపై నమ్మకం లేకనే మారుస్తున్నారా అన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

ముఖ్యంగా మంగళగిరి పై అందరి ఫోకస్ పడింది మంగళగిరిలో టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు అయితే గత ఎన్నికలలో ఇక్కడి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచారు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అయితే ఏమైందో తెలియదు కానీ తిరిగి ఈయన సొంత పార్టీ చెంతకు వచ్చారు.

ఇలా ఆల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చినప్పటికీ ఆయనకు మంగళగిరి టికెట్ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈ మంగళగిరికి గంజి చిరంజీవి ఇన్చార్జిగా వ్యవహరించారు అయితే తాజాగా లావణ్య అనే కొత్త మహిళ పేరు తెరపైకి వచ్చింది. లావణ్యకు ఈ రాజకీయం కొత్తది అయినప్పటికీ ఆమె రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినదని తెలుస్తుంది. లావణ్య తండ్రి గారు మామగారు ఇద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కావడంతో ఈమెను మంగళగిరి అభ్యర్థిగా నిలబెడితే గెలిచే అవకాశాలే ఉన్నాయని తెలుస్తుంది.

అయితే ఈమె నారా లోకేష్ తో ఢీ కొట్టాల్సి ఉంటుంది నారా లోకేష్ 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి ఎన్నికలలో కనుక ఓడిపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గుర్తించిన లోకేష్ ఎలాగైనా మంగళగిరిలో గెలుపొందాలన్న దిశగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే లోకేష్ పై గెలుపొందడానికి సరైన అభ్యర్థులు లేకపోవడంతోనే జగన్ పదేపదే మంగళగిరి అభ్యర్థులను మారుస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -