Bhanu Shree: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న భాను.. ఇంతకు వరుడు ఎవరంటే?

Bhanu Shree: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ భాను గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షో లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. నిజానికి ఈ షోనే భానుకి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం భాను వెండి తెరపై తెగ హడావిడి చేస్తుంది.

అంతక ముందు భాను అడపా దడపా సినిమాల్లో నటించినప్పటికీ.. ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక పలు బుల్లితెర షోలలో కూడా నటించి కొంతవరకు గుర్తింపు సంపాదించుకుంది. మొత్తానికి ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టగానే హీరోయిన్ స్థాయిలో హడావిడి చేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో సోషల్ మీడియా లవర్స్ ని ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఇక తన పెళ్లి చేసుకోబోయే వరుడు విషయానికొస్తే.. ఆమె తన ఫ్రెండ్ ను ప్రేమిస్తుందని అంతేకాకుండా అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన విషయం గురించి గతంలో కూడా భాను ఒక మాటను చెప్పుకొచ్చింది.

అదేమిటంటే.. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో భాను మాట్లాడుతూ.. తను కెరీర్ పరంగా సెటిల్ అవ్వడానికి తన ఫ్రెండే కారణమని చెప్పుకు వచ్చింది. అంతే కాకుండా అతడిని లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపింది. ఈ విషయం గమనించిన కొందరు భాను ఇతడినే పెళ్లి చేసుకుంటుంది అని బ్రేక్ ఇస్తున్నారు. మరి ఈ వార్తల వెనక నిజం ఎంత ఉందో.. అబద్ధం ఎంత ఉందో.. భాను స్పందించే వరకు వేచి చూడాల్సి ఉంది. ఏదైనా బిగ్ బాస్ షో భాను లైఫ్ ను మార్చేసింది అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -