Sai Pallavi: నేను, నా చెల్లి వేధింపులు ఎదుర్కొన్నాం.. సాయిపల్లవి సంచలన వ్యాఖ్యలు!

Sai Pallavi: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి సాయి పల్లవి ఒక హీరోయిన్ గానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన న్యాచురల్ అందాలతో అందర్నీ ఫిదా చేసింది ఈ బ్యూటీ. చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకొని స్టార్ పొజిషన్ కు చేరుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక విషయాన్ని బయట పెట్టింది.

 

ప్రస్తుతం సింగర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోలో వ్యాఖ్యాతగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా సాయి పల్లవి ఈ షోలో పాల్గొని తన చిన్నతనంలో ఎదురైన ఒక సంఘటన గురించి బయట పెట్టింది. చిన్నతనంలో తను బాగా అల్లరి పిల్లను అంటూ.. క్లాసులు ఎగ్గొట్టి మరి డాన్స్ శిక్షణకు వెళ్లే దాన్ని అని తెలిపింది సాయి పల్లవి.

అయితే తాను ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి స్టేజిపై డాన్స్ చేస్తున్నప్పుడు.. అప్పుడు తల జుట్టు చిన్నగా ఉండేదని.. దాంతో తన జుట్టు పొడవుగా కనిపించడం కోసం తన అమ్మ ఒక చున్ని తనకు తలకు కట్టింది అని.. అయితే డాన్స్ చేస్తున్నప్పుడు అది ఊడిపోయి కింద పడిపోయింది అని.. దాంతో తనకు చాలా బాగా ఇబ్బందిగా అనిపించింది అని.. వెంటనే స్టేజి దిగి తన తల్లి దగ్గరికి వెళ్లి బాగా ఏడ్చానని.. తన తల్లి కూడా చాలా బాధపడిందని తెలిపింది.

 

ఇక తనకు రియాలిటీ షోలు అంటే భయం.. అంతగా ఆసక్తి ఉండదని.. అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తను ‘ఉంగళిల్ యార్ ప్రభుదేవా’ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాను అని.. అయితే అందులో తను ఎలిమినేట్ అయ్యాను అంటూ.. కానీ కట్ చేస్తే పదేళ్ల తర్వాత అదే చెట్టులో ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన పాటకు డాన్స్ చేశాను అంటూ తెలిపింది.

 

ఇక ఆ తర్వాత.. లవ్ స్టోరీ సినిమాలో అమ్మాయి ఎదుర్కొన్న దాని గురించి మాట్లాడుతూ.. చేతలతోనే కాదు మాటలతో కూడా పక్కవారిని ఇబ్బంది పెట్టిన అది వేధింపులతోనే సమానం అంటూ.. అయితే తను, తన చెల్లి, తన తల్లి, మామ్మ ఇలా ప్రతి ఒక్కరు వేధింపులు ఎదుర్కొన్న వారే అని.. వేధింపులకు గురి కాకుండా ఒక్క అమ్మాయిని కూడా తను చూడలేదు అని.. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఇటువంటివి ఎదుర్కొంటున్నారని.. ప్రతి ఒక్కరిలో ఇటువంటి బాధ ఉంటుంది అని.. అసలు ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలి.. చెబితే నమ్ముతారా లేదా అనేది.. అందుకే అలాంటి వాళ్లకు తన సినిమా చూపించి తనకు కూడా ఇలాగే జరిగింది అని.. వాళ్ళ అమ్మకు చెప్పి ఇబ్బంది నుంచి విముక్తి పొందొచ్చు అని తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -