Mega Daughter Srija: చిరు కూతురు చెబుతున్న నీతులు వింటే షాకవ్వాల్సిందే!

Mega Daughter Srija: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతున్న సెలబ్రిటీ డాటర్లలలో కొణిదెల శ్రీజ ఒకరు. వ్యక్తిగత కారణమైనా.. ఇతర కారణాలైనా.. ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెడితే ట్రోలర్స్ ఆమె పని పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని వదిలేసిందంటూ ఈమెపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో శ్రీజ.. పిల్లల పెంపకం విషయంపై నీతులు చెప్పడంతో అందరూ షాకింగ్‌కి గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ సారి ఆమె చేసిన పోస్టుకి నెటిజన్లతోపాటు మెగా అభిమానులు కూడా షాకవుతున్నారు.

 

ఈ సందర్భంగా కొణిదెల శ్రీజ మాట్లాడుతూ..‘నా పిల్లలు నా మాట విని.. నేను చెప్పిన దారిలోనే నడవాలని రూల్ లేదు. చెప్పిన దారిలోనే వెళ్లాలని నేను అనుకోవట్లేదు. కేవలం పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టే అమ్మ స్థానంలోనే నేను ఉన్నా. కానీ వాళ్లు తమ వ్యక్తిగత నిర్ణయాలను తాము తీసుకునే విధంగా స్వేచ్ఛనిస్తాను. అప్పుడే వాళ్లకి ఏది తప్పో.. ఏది కరెక్టో అనే విషయం అర్థమవుతుంది. ఈ విషయంపై వాళ్లకు క్లారిటీ ఉంటే.. మనం అసలు పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. నా చిన్న కూతురు నవిష్క అల్లరి పిల్ల. పెద్ద కూతురు నివృతి కొంచెం సైలెంట్. పిల్లల్నీ గారాభంగా పెంచితే చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎక్కువ గారాభం చేయకూడదు. ఎక్కడ దగ్గర తీసుకోవాలో.. ఎక్కడ కోపగించుకోవాలో తెలిసి ఉండాలి. ఓ అమ్మగా ఈ విషయంపై నాకు అవగాహన ఉంది.’ అని చెప్పుకొచ్చింది.

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారాభంగా పెంచినప్పటికీ.. క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్‌ గా ఉండేవారని శ్రీజ పేర్కొంది. గారాభం చేస్తూనే చాలా పద్ధతిగా పెంచాడని చెప్పుకొచ్చింది. అయితే శ్రీజ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పద్ధతి, క్రమశిక్షణ గురించి నువ్వు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని.. ఇద్దరితోనూ విడిపోయావని, తండ్రి పరువును ఎప్పుడో తీసేశావని మండిపడుతున్నారు. పిల్లలకు పద్ధతిగా నేర్పించడం కన్నా.. నీలా తయారు కాకుండా చూసుకుంటే చాలని సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -