Balakrishna: బాలయ్యను టార్గెట్ చేస్తున్న మెగా అభిమానులు.. ఆ నెగిటివ్ కామెంట్ల వెనుక ఇంత కథ ఉందా?

Balakrishna: మెగాస్టార్ అభిమానులని చూస్తుంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిందనే సామెత గుర్తొస్తుంది. ఈమధ్య మెగాస్టార్ ఫ్లాప్ ల మీద ఫ్లాప్ లు ఇచ్చుకుంటూ కెరియర్ ని ప్రశ్నార్ధకంగా మార్చుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోలు.. హీరోలు బాగానే ఉంటారు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ చిన్న విషయాన్నే పెద్దది చేస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగింది అద.. బోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయితే అటు చిరంజీవి బాగానే ఉన్నారు.

ఇటు బాలకృష్ణ కూడా బాగానే ఉన్నారు. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం బోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయినందుకు పండగ చేసుకుంటూ చిరంజీవిని తెగ ట్రోల్స్ కి గురి చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయినందుకు కూడా పెద్దగా బాధపడలేదు చిరంజీవి అభిమానులు. కానీ తమ ఫేవరెట్ హీరోని ట్రోల్స్ కి గురి చేస్తుంటే మాత్రం భరించలేకపోయారు. మామూలుగా అయితే మెగా అభిమానులు బాలకృష్ణ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోరు.

 

కానీ ఎప్పుడైతే తమ అభిమానం హీరోని ట్రోల్స్ చేస్తున్నారో ఇక వాళ్ల అభిమాన హీరో అయినా బాలయ్య మీద గురి పెట్టారు మెగా అభిమానులు. బాలకృష్ణ ఈ మధ్య జరిగిన స్కంద ఈవెంట్ ని ఆసక్తిగా గమనించారు కొందరు అభిమానులు. బాలకృష్ణని ప్రతికూలంగా చూపించటానికి క్లిప్ లని నిశ్చితంగా ఎడిట్ చేసి సందర్భాన్ని తారుమారు చేసేంతవరకు వెళ్లారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు రామ్ పోతినేని సమాధానం ఇస్తూ బాలకృష్ణ వంటి స్టార్ తన పక్కన నిలబడి ఉన్నప్పుడు స్క్రీన్ ప్రజెంట్ గురించి మాట్లాడలేనని పేర్కొన్నాడు.

 

ఆ బిట్ ని బాలకృష్ణ సీరియస్ ఎక్స్ప్రెషన్ తో ఎడిట్ చేసి బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు శ్రీల నవ్వు ఆపుకున్న క్షణాన్ని కూడా వారు ఎడిట్ చేసి హైలెట్ చేశారు. ఇప్పుడు రాబోయే భగవంత్ కేసరి మీద దృష్టి సారించారు మెగా అభిమానులు. కుదిరినంతవరకు బాలకృష్ణని ట్రోల్ చేయడానికి ఎదురుచూస్తున్నారు. మరి మెగా అభిమానులకి స్టఫ్ ఇవ్వకుండా అనిల్ రావిపూడి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -