Fans War: చిరంజీవి ఫ్యాన్స్ Vs బాలయ్య ఫ్యాన్స్. మధ్యలో నందమూరి మోక్షజ్ఞ !!

Fans War: తెలుగు హీరోలనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు లెజెండ్ గా పేరు తెచ్చుకొన్న బాలకృష్ణ గారు. అప్పట్లో కరోనా పరిస్థితుల తర్వాత వచ్చిన అఖండ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. థియేటర్ లను మర్చిపోయిన జనాన్ని సినిమా హాళ్ల వైపు వెళ్ళేలా చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.

అయితే ఈ మధ్యనే గాడ్ ఫాదర్ సినిమాతో మనముందుకు వచ్చిన చిరంజీవి ఒక పక్క కలెక్షన్లతో దూసుకొని వెళ్తుంటే ఈ సంధర్బంలో నందమూరి వారికి మరోపక్క మెగా ఫ్యాన్స్ కి మధ్య కోల్డ్ వార్.. మొదలై మెల్లగా ముదిరిపోతుంది. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెడుతున్న కొన్ని పోస్టులే ఈ వివాదానికి కారణమవుతున్నాయి.

ఇటీవల బాలకృష్ణ హీరోగా విడుదలైన అఖండ సినిమాను, అక్టోబర్ 5 న చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్‌ఫాదర్ సినిమా.. ఈ రెండు సినిమాలకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్లను పోల్చుకొంటూ భారీ రచ్చకు దిగుతున్నారు. తమ హీరో గ్రేట్ అంటే తమ్ హీరో గ్రేట్ అంటూ స్టార్ హీరోల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. గత రికార్డుల తాలూకు వివరాలు పోస్ట్ చేస్తూ కొందరు ట్రోల్స్ కి దిగుతున్నారు

అఖండ సినిమా తొలి రోజున 16 కోట్లకుపైగా షేర్‌ రాబట్టగా ,గాడ్ ఫాదర్ మూవీ మాత్రం తొలి రోజున 13 కోట్లతో సరిపెట్టుకుంది. దీనికి నందమూరి మోక్షజ్ఞ పేరుతో ఉన్న అకౌంట్ వాడేస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ రచ్చలు ఎక్కువైందని వాపోతున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా అనేది ఉపయోగపడే విధంగా ఉండాలని లేని పోనీ విషయాలను తీసుకొని రచ్చ చేయొద్దని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -