God Father Teaser: మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.. దుమ్మురేపుతోన్న గాడ్ ఫాదర్ టీజర్!

God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ బర్త్ కానుగా చిత్ర యూనిట్ గాడ్ పాథర్ టీజర్ నుంచి విడుదల చేసింది. ఇందులో చిరు దుమ్ము లేపారు. చిరు లుక్ చాలా కొత్తగా ఉంది. మాస్ ప్రేక్షకులను కట్టి పడేసేలా చిరు లుక్ అదిరిపోయేలా ఉంది. ఇక టీజర్ లోని డైలాగ్స్ పవర్ పుల్ గా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్లకు కొదువే లేదు. టీచర్ లోని యాక్షన్ సీన్లు పేలిపోయేలా ఉన్నాయి. మెగా ఫాన్స్ అంచనాలకు మించి ఈ టీజర్ ఉంది.

ఇప్పటికే విడుదలైన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ వీడియో యూబ్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది. మెగాస్టార్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. తాజా టీజర్ లో బాలయ్య వందనం చేసుకుంటూ, గన్ తో ఫైర్ చేస్తూ ఉన్న సీన్లు హైలెట్ గా నిలిచాయి. ఇక సల్మాన్ ఖాన్ తో కలిసి కారులో వచ్చే సీన్ సమయంలో ఉండే యాక్షన్ సీన్లు గూస్బమ్స్ తెప్పిస్తున్నాయి.

నయనతార ఇంట్రడక్షన్ కొత్తగా ఉంది. ఫస్ట్ లుక్ కు మంచి టీజర్ వీడియో ఉంది. ఈ వీడియోతో చిత్ర బృందం ఫ్యాన్స్ లో అంచనాలను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ ఏడాది విజయదశమికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు టీజర్ లో అధికారికంగా ప్రకటించారు. టీజర్ లో సల్మాన్ ఖాన్ బైక్ పై, కారులో ఉండి చేసే యాక్షన్ సీన్లు కనిపించాయి. ఈ టీజర్ కు నటుడు మురళీశర్మ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 20 ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో తెియదు.. సడెన్ గా తిరిగి వచ్చి ఆరేళ్లలో పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీశర్మ చిరు గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అంటూ చిరు అంటాడు. ఇక సత్యదేవ్, సునీల్, నయనతార ఈ సినిమలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మలయాలంలో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసీఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి రేపు చిరంజీవి జన్మదినం సందర్భంగా ఫ్యాన్స్ కు ఈ టీజర్ తో భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -