Megastar-Young Tiger: మెగాస్టార్ యంగ్ టైగర్ కాంబో మూవీ అలా ఉండబోతుందా?

Megastar-Young Tiger: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. రాజమౌళి ఏ సినిమా చేసిన అది కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆయనతో సినిమా తీయాలని పలువురు స్టార్ హీరోలు సైతం వేడుకున్న సందర్భాలున్నాయి. అయితే కథ దొరికితేనే రాజమౌళి కమిట్ అవుతాడు. వరుసగా ఒక్కో స్టార్ హీరోతో ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచ ఖ్యాతిని రాజమౌళి పొందాడు. ఆ సినిమా ద్వారా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

 

గతంలో చాలా మంది రాజమౌళిని తమ హీరో సినిమా చేయమంటూ అడిగారు. అందుకు రాజమౌళి కూడా కథ సిద్ధం అయితే తాను సినిమా చేయడానికి రెడీ అని తెలిపాడు. త్వరలోనే ఈయన సూపర్ స్టార్ మహేస్ బాబు తో సినిమా చేయనున్నాడు. అయితే ఇప్పుడు మరో వార్త కూడా వినపడుతోంది. రాజమౌళి మెగాస్టార్ తో కూడా కలిసి సినిమా చేసే అవకాశం కూడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

 

దర్శకధీరుడు రాజమౌళికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఆ హీరోలు ఇద్దరితో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో అయితే మూడు సినిమాలు వరకూ రాజమౌళి చేశారు. త్వరలో ఎన్టీఆర్, మెగాస్టార్ కాంబినేషన్ లో ఒక సినిమాను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని, పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి.

 

రాజమౌళియే కనుక మెగాస్టార్ చిరంజి, నందమూరి ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే భారీ విజయం నమోదు చేయడం కచ్చితంగా జరుగుతుందని అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఈ సినిమా త్వరగా రావాలని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -