Bhola Shankar: క్రేజీ అప్డేట్ తో పిచ్చెక్కిపోతున్న మెగా ఫ్యాన్స్?

Bhola Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు చిరంజీవి ఆగస్టు 22వ తేదీ తన పుట్టిన రోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు తన పుట్టిన రోజు వేడుకలను జరపడం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక ఈయన పుట్టినరోజు కావడంతో చిరంజీవి నటిస్తున్న సినిమాల నుంచి కూడా వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్నటువంటి భోళా శంకర్ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటించగా చిరంజీవికి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇకపోతే ఈయన నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమా కూడా ఈ ఏడాది దసరా కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇలా వెంట వెంటనే మెగాస్టార్ సినిమాలో విడుదల కావడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ భోళా శంకర్ సినిమాలపై అభిమానులు ఆశలు పెట్టుకొని ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇక మెగాస్టార్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే ఈయన పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర మూవీని తిరిగి విడుదల చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -