Men-Women: పురుషులు ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఇష్టపడుతారో తెలుసా!

Men-Women: మన ప్రవర్తనను బట్టే ఇతరులు గౌరవిస్తున్నారు. అందరి ప్రవర్తన ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఏ వ్యక్తికి అయినా వారి ప్రవర్తన, లక్షణాలే వారికి గౌరవాన్ని తెచ్చిపెడుతాయి. అయితే కొంతమందికి మన ప్రవర్తన మ‌న‌ లక్షణాలు నచ్చకపోతే అది మన తప్పు కాదు కానీ ఎక్కువమంది మన వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే కచ్చితంగా ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. పురుషులు స్త్రీలను ఇష్టపడాలి అన్నా.. స్త్రీలు పురుషులను ఇష్టపడాలి అన్నా వారిలో ఉండే లక్షణాలు ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుంది.

అయితే.. ఆచార్య చాణ‌క్యుడు స్త్రీలలో కొన్ని లక్షణాలు ఉంటే పురుషుడు ఎక్కువగా ఇష్టపడతారని తన నీతిలో పేర్కొన్నాడు. డబ్బులు మితంగా ఆచితూచి ఖర్చు చేసే వాళ్లు అంటే పురుషులు ఇష్టపడతారట. డబ్బును చూసి ఖర్చు చేసే వారికి కష్టం విలువ కూడా తెలుస్తుందని పురుషులు అభిప్రాయపడతారని చాణక్యనితిలో పేర్కొన్నాడు. జీవితం సాఫీగా సాగిపోవాలంటే ముందుగా ఇంటిని నడపడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొనానడు. ఇంటిని జాగ్రత్తగా నడిపే మహిళలు అంటే పురుషులు ఇష్టపడతారట. ఇంటితో పాటు భార్య, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులను గౌరవించే మహిళలను పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారని వెల్లడించాడు.

ఇంటి విషయాలు బయటకు పొక్కకుండా భర్త కష్ట సుఖల్లో పాలు పంచుకోవడం, గొడవలకు దూరంగా ఉండటం, బంధువులతో త్వరగా కలిసిపోవడం వారంటే పురుషులు అమితంగా ఇష్టపడుతారని చాణుక్యుడు వెల్లడించాడు. అంతేకాకుండా జాలి, దయ కలిగిన మహిళలను పురుషులు ఇష్టపడతారట. అలాంటివాళ్లు ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు సాయం చేయడంతో పాటు సొంత వారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారని చాణక్యుడు చాణక్యనీతిలో పేర్కొన్నాడు. అత్తారింట్లో కలివిడిగా ఉంటూ అందరితోనే నవ్వుతు మాట్లాడుతూ.. మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండే మహిళలను చాలా ఇష్టపడుతారని చాణక్యుడు నీతి శాస్త్రం లో పేర్కొనాడు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -