Minister KTR: ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. ప్రజలపై కేటీఆర్ అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!

Minister KTR: తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని పేద ప్రజలందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని గత ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో భాగంగా కొందరి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసేవారి చేతిలో పెట్టారు అయితే తాజాగా మరో దశలో భాగంగా డబుల్ బెడ్ రూమ్ పంపిణి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్‌ బెడ్ రూం ఇళ్లలో 30 వేల ఇళ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తైందని.. మిగిలిన 70 వేల ఇళ్లను వచ్చే నెలన్నర వ్యవధిలోగా పేదల చేతిలో పెడతామని ఈయన తెలియజేశారు. ఎన్నికలు వచ్చే సమయానికి ఇల్లు లేని పేద అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఇళ్లు రావడానికి అర్హత కలిగి ఉండే రాకపోయినా వారందరికీ భవిష్యత్తులో కూడా ఇల్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అందరికీ చెప్పిన విధంగా ఇల్లు పంపిణీ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉండేది.

ఇప్పుడు మాత్రం ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెబుతున్నారని ఈయన వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టడానికి ప్రభుత్వానికి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఈయన వెల్లడించారు. లక్ష ఇళ్లకు మార్కెట్‌ విలువ 50వేల నుంచి 60 వేల కోట్ల వరకు ఉంది. ఆ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం పేదల చేతిలో పెడుతుంది. ఒక్క రూపాయి లంచం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇల్లు పట్టాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -