Peddireddy: సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి…

Peddireddy: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఏ ఎన్నికలు జరిగిన అనంతపురంలో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో అదే సీను రిపీట్ అయింది అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అనంతపురం జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ కేవలం రెండు సీట్లు వచ్చాయి. మిగతా సీట్లన్నీ వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి గాలి బలంగా వీచిన అనంతపురంలో రెండు సీట్లు గెలుచుకుందంటే తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో అర్థమవుతుంది.

 

అయితే వైసిపి అధికారం చేపట్టి తన పాలనతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వైసిపి పరిస్థితి దిగజారుతు వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం జగన్ క్యాబినెట్ లో కీలక మంత్రి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వైసీపీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతుంది అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలపడిందని వైసీపీకి వ్యతిరేకత ఎదురవుతుందని. అయితే మళ్ళీ ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి వచ్చి ఈసారి కూడా అనంతపురంలో గత ఎన్నికల్లో సాధించిన సీట్లే సాధిస్తామని చెప్పారు. అయితే ఇది కార్యకర్తలు ఉత్సాహం నింపడానికి చేసిన వ్యాఖ్యలు తప్ప నిజానికి అనంతపురంలో వైసీపీకి అంత సీను లేదనేది మంత్రి పెద్దిరెడ్డి ముందే స్పష్టం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.ఈ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గత రెండు ఎన్నికల నుండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. ఈసారి ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎలాగైనా సరే విజయం సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి అక్కడ తిష్ట వేసుకున్నారు. వైసీపీ నాయకులను ఉసిగొలిపి టిడిపి నాయకులను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 

కానీ హిందూపురం ప్రజలు మాత్రం ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఏది ఏమైనా సరే నందమూరి బాలకృష్ణ అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడతారు. ఆయనకే తమ ఓటు వేస్తామంటూ తేల్చి చెబుతున్నారట. ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలను వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. ఈ విషయం ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెళ్లడైంది. అయినా కూడా ఏం చేశానైనా మళ్లీ అధికారం చేపట్టాలని జగన్ మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -