Minister Roja: మంత్రి రోజా అలా మోసం చేశారు.. వార్డ్ కౌన్సిలర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Minister Roja: మంత్రి రోజాపై సొంత నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ చైర్మన్ పదవి ఇస్తామని తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని ఆరోపించారు. మంత్రి రోజా తన సోదరుడు కుమారస్వామి తో మాట్లాడమని చెప్పారని ఆయనను కలిస్తే డబ్బులు డిమాండ్ చేశారు అన్నారు. పదవి పేరు చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నారని ఇప్పుడు ఇవ్వకుండా తిప్పుకుంటున్నట్లు ఆరోపించారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని అమ్మేసుకున్నారని ఆవేదన చెందారు భువనేశ్వరి.

 

రిజర్వేషన్ ఉండటంతో తనకు పదవి ఇస్తానని హామీ ఇచ్చారని తాను ఏకగ్రీవంగా గెలిచిన వెంటనే పదవిపై భరోసా ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత మాట తప్పారు. ఇప్పుడు డబ్బులు పోయాయి, పదవి మాత్రం దక్కలేదు. రెండో విడతలో చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు తనకు అవకాశం దక్కలేదన్నారు. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయమాటలు చెబుతున్నారన్నారు. తమకు ఎన్నికల తరువాత పదవి అవసరం లేదు.

తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే మంత్రి రోజా, ఆమె సోదరుడి నుంచి కనీసం స్పందన లేదన్నారు మంత్రికి మెసేజ్ చేసినా కనీసం స్పందన లేదన్నారు దళిత మహిళను అయిన తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని కోరుతున్నాను అన్నారు భువనేశ్వరి. తన దగ్గర డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రోజా సోదరుడు కుమారస్వామి అనుచరుడు సత్య తన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్లినట్లు ఆమె చెప్పారు.

 

విడతల వారీగా డబ్బులు ఇచ్చామని ఒకసారి 20 లక్షలు, మరొకసారి ఏడు లక్షలు, ఇంకొకసారి మూడు లక్షలు, మరొకసారి 10 లక్షలు ఇచ్చినట్లు వివరించారు. రోజా సోదరుడు తనకు 29 లక్షలు మాత్రమే ఇస్తామన్నారని అవైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వటం లేదన్నారు రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారని మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం కేసు తీసుకునే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పుకొచ్చారు భువనేశ్వరి.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -