Roja-Balakrishna: బాలకృష్ణ ఓ మెంటల్ గాడు.. బాలయ్యకు అది చేతకాదు.. రోజా సంచలన వ్యాఖ్యలు వైరల్!

Roja-Balakrishna:  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన అనంతరం వైసిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నటి మంత్రి రోజా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే ఇంటిలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా తరచూ మీడియా సమావేశాలలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి రోజా చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై తాజాగా బాలకృష్ణ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గురించి రోజూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై బాలకృష్ణ తన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడమే కాకుండా త్వరలోనే తాను ప్రజల మధ్యకు వస్తాను అంటూ తెలియచేశారు.

ఈ విధంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా మాట్లాడుతూ బాలకృష్ణ ఓ మెంటల్ గాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు మెంటల్ ఉందని నేను చెప్పలేదు స్వయంగా ఆయనే తన ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కోర్టులో తనకు మానసిక పరిస్థితి బాగాలేదు అంటూ ఆధారాలు చూపించకున్నారని రోజా గుర్తు చేశారు. ఇలాంటి ఒక మానసిక రోగి ప్రజల మధ్యకు వచ్చి తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటే ఆ టిడిపి పని అయిపోయినట్లేనని రోజా వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు హడావిడి అంతా ప్రజల మంచి గురించి కాదని, తన పార్టీని ముందుకు నడిపించాలనే ఉద్దేశం కాదని తన బావను బయటకు తీసుకురావాలని ఇక రేపోమాపో తన అల్లుడు లోకేష్ కూడా అరెస్టు కాబోతున్నారన్న విషయం తెలియడంతోనే ఇలాంటి హడావిడి చేస్తున్నారు అంటూ రోజా బాలకృష్ణ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -