Roja-Nara Lokesh: మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారేంటి రోజా.. ఇలా చేయడం ఎంతవరకూ రైట్ అంటూ?

Roja-Nara Lokesh: రోజా లోకేష్ పై చేసిన కామెంట్స్ కి ఫైర్ అవుతున్నారు తెలుగుదేశం వర్గం వారు. మీరు చేసిన తప్పులు కనిపించడం లేదా అంటూ రోజా పై ఎదురుదాడి చేశారు తెలుగుదేశం వర్గం వారు. అయితే రోజా ఏమని కామెంట్ చేశారంటే మొన్నటి వరకు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పిన లోకేష్ నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం వెనక ఉన్న పరమార్థం ఏమిటి.. అంటే లోకేష్ తప్పు చేసాడని ఒప్పుకుంటున్నట్లేనా అంటూ తనదైన శైలి లో నోరు పారేసుకుంది.

అయితే రోజా తీరుపై మండిపడుతున్న తెదేపా వర్గం వారు నారా లోకేష్ ముందస్తు బెయిల్ గురించి మాట్లాడేటప్పుడు మీ పార్టీలో ఎంతమందికేలక నేతలు బెయిల్ పై బయట ఉన్నారనే విషయం మరిచిపోయినట్లున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గత వారమే బెయిల్ వచ్చిన పదేళ్ల వార్షికోత్సవాన్ని విజయవంతంగా పూర్తి పూర్తి చేసుకున్న విషయం రోజా మరచిపోయినట్లుగా ఉంది. రోజా దృష్టిలో జగన్ నిందితుడు కాదేమో..

అయినా జగన్ ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అవేవీ రోజా కి గుర్తులేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేయించుకున్నాడు అందుకే ఇప్పటివరకు జైలుకెళ్లకుండా బయట షికార్లు చేస్తున్నాడు. అంటే అవినాష్ రెడ్డి కూడా తప్పు చేయడం వలననే ముందస్తు బయలు తీసుకున్నాడని ఇన్ డైరెక్ట్ గా రోజా చెప్తున్నారా అంటూ కడిగి పారేశారు తెలుగుదేశం వర్గం వారు.

అంతటితో ఊరుకోకుండా గత నాలుగేళ్లుగా కోడి కత్తి కేసులో కోర్టు ఎదుట జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కావడం లేదో, నేడు కూడా ఈ కేసు విచారణకు రాగా జగన్ ఎందుకు విచారణకు హాజరు కాలేదో ప్రజలందరికీ తెలుసు కానీ రోజా సెలవిస్తే తెలుసుకోవాలని జనాలు అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడి రోజా తన గొయ్యి తానే తవ్వుకుంటుంది అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు తెదేపావారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -