Rayalasima Ramanna Chowdary: మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి సినిమా విజయం ఎందుకు సాధించలేదో తెలుసా!

Rayalasima Ramanna Chowdary: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి స్టార్ హీరో మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగులో 570 సినిమాలకు పైగా నటించి నటుడుగా తనకంటూ తెలుగు నాట చరగని ముద్ర సంపాదించుకున్నాడు. మోహన్ బాబు ఇండస్ట్రీలోని హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా 72 సినిమాలను నిర్మించాడు. అలా ఒకప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలిగాడు మోహన్ బాబు.

ఇక మోహన్ బాబు నటుడు గానే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 1995 నుంచి 2001వరకూ మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పని చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో మోహన్ బాబు 500వ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. పెదరాయుడు సినిమా తర్వాత ఆ స్థాయిలో మంచి సక్సెస్ అందుకునే సినిమా ఇదే అని అందరూ అనుకున్నారు.

అప్పట్లో ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ వచ్చింది. ఇక భారీ అంచనాల మధ్య 2000లో సెప్టెంబర్ 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో మోహన్ బాబు సినిమాకు మంచి హడావిడి చేసిన లాస్ట్ సినిమా ఇదే. అలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పూర్తిగా పరాజయపాలైంది. ఇలా విజయం సాధించ పోవడానికి కారణాలు మూడు ఉన్నాయి. అందులో మొదటిది స్క్రీన్ ప్లే లోపం. ఎందుకంటే మోహన్ బాబుని మొదట పార్ట్ లో మంచి పవర్ ఫుల్ గా చూపించారు.

తర్వాత పార్ట్ లో మోహన్ బాబును పరిస్థితులకు లొంగిపోయే విధంగా చూపించారు. అప్పటి ప్రేక్షకులకు ఇలా చేయడం పూర్తిగా నచ్చలేదు. ఇక రెండవది ఏమిటంటే మోహన్ బాబు ఎమోషనల్ గా బాగానే పండించినప్పటికీ చివరిలో తను చనిపోవడం చాలా మైనస్ గా కనిపించింది. ఇక రెండవ మోహన్ బాబు పాత్రకి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. మొత్తానికి ప్రేక్షకులు సినిమాలో ఉన్న మెయిన్ తీమ్ కు పూర్తిగా కనెక్ట్ కాలేదు. అందుకే అప్పట్లో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -