YSRCP MLA: ఒక్కో వాలెంటీర్‌కు రూ.5 వేలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే .. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందా?

YSRCP MLA: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికీ అన్ని పార్టీ నేతలు రంగంలోకి దిగారు. అయితే వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు గెలుపు కోసం భారీ స్థాయిలో ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఎన్నికల తాయిలాలను ప్రజల వద్దకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా వైసిపి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల సహాయంతో ప్రతి ఇంటింటికి రైస్ కుక్కర్లతో పాటు డబ్బులను సరుకులను కూడా చేరవేస్తూ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయాలి అంటూ పెద్ద ఎత్తున వాలంటీర్లు ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు అయితే తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే వాలంటీర్లకు భారీ స్థాయిలో డబ్బును పంచారు.

నరసరావుపేటలో వాలంటీర్ల సమావేశం పెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి ఒక వాలంటీర్ కి సుమారు 5000 రూపాయల నగదు అందుచేశారు అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేసి తనని గెలిపించే బాధ్యత వాలంటీర్లదే అంటూ ఎమ్మెల్యే ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతోనే వైసిపి నాయకులు ఇలా భారీ స్థాయిలో కుక్కర్లను పంచడం డబ్బులను పంచడం చేస్తున్నారని తెలిపారు. ఇక వాలంటీర్లను టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల తాయిలాలు పంపించడం గమనార్హం. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్రావు ప్రజలకు కుక్కర్లో పంపిణీ చేస్తున్నారు. స్వయంగా వాలంటీర్లు వెళ్లి ప్రజలకు కుక్కర్లు ఇవ్వడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -