Mohan Babu: మోహన్ బాబు కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Mohan Babu:కలెక్షన్‌ కింగ్‌గా పేరుగాంచిన సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు తరచూ వివాదాస్పద అంశాలు మాట్లాడుతూ.. వార్తల్లో నిలుస్తుంటారు. హీరోగా, విలన్ కమ్‌ కమెడియన్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు మోహన్‌బాబు. తిరుపతిలో జరిగిన హీరో విశాల్‌ లాఠీ అనే మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి హల్‌ చల్‌ చేశారు మోహన్‌బాబు.

 

ప్రభుత్వాల్ని నడిపే పాలకులు, శాంతిభద్రతల్ని పర్యవేక్షించే పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లతోపాటు కొందరు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే ప్రభుత్వాల కింద పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం తాను స్వయంగా చూశానని వ్యాఖ్యానించారు. మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

 

గతంలో ఎంపీగానూ సేవలందించిన మోహన్‌బాబు.. సినిమా ఇండస్ట్రీలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అప్పుడప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తారంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు మోహన్‌బాబు. సమాజంలో కళ్ల ముందే ఎన్నో తప్పులు జరుగుతున్నా వాటిని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

 

ఎవరిని టార్గెట్‌ చేశారో?
ఇలా విద్యార్థుల ముందే కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తే వారిపై ప్రభావం చూపుతుంది కదా.. అంటూ మోహన్‌బాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందే తప్పులు జరుగుతున్నా వాటిని పోలీసులు పట్టించుకోవడం లేదని కామెంట్లు చేయడంపై పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ ఆఫీసర్లపై కూడా కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మోహన్‌బాబు వ్యాఖ్యల వెనుక ప్రభుత్వాధినేతలను ప్రశ్నిస్తున్నారా? లేక ఎవరిని టార్గెట్‌ చేశారో అర్థంకాక చాలా మంది చర్చించుకుంటున్నారు. అనంతరం హీరో గురించి మాట్లాడిన మోహన్‌బాబు.. తమిళ హీరో విశాల్‌ మంచి నటుడని.. కానీ కొంచెం పొగరు ఉందని కామెంట్‌ చేశారు. లాఠీ మూవీ హిట్‌ కొట్టాలని ఆకాంక్షించారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -