YCP: వంద రోజుల్లో వైసీపీ ఫినిష్ అంటున్నా ఎంపీ…!

YCP: కనుమూరి రఘురామ కృష్ణంరాజు గురించి అందరికీ తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే వైసిపి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటినుండి వైసిపి రెబల్ ఎంపీగా బాగా గుర్తింపు పొందారు. వైసీపీ తరఫున మాట్లాడుతున్నట్లు మాట్లాడి వైసీపీని ఇరుకున పెట్టడం ఈయనకి బాగా అలవాటు. మా పార్టీ అని చెప్పుకుంటూ వైసిపి చేసే అరాచకాలను అక్రమాలను వీడియో ద్వారా ప్రజలకు చేరవేస్తూ ఉంటారు.

 

తాజాగా ఆయన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడారు… జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, ఓటమి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుందని అందుకే ఏం చేయాలో తెలీక నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుకుంటూ వెళ్లిపోతున్నారని అన్నారు. ఇంకా వంద రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అధికారం మిగిలి ఉందని శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు
18 నుంచి 25 స్థానాలు మాత్రమే వైసిపి గెలుస్తుందని జోస్యం చెప్పారు. మహా అయితే జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పడిన 30 స్థానాలు నుంచి గెలవలేరని కుండ బద్దలు కొట్టారు.

ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ఆయన దాన గుణాన్ని, ప్రజల్ని ప్రేమించే విధానాన్ని ఆరు రోజుల్లోనే తెలుసుకొని భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారనీ, మరో వారం పది రోజుల వ్యవధిలో ఆయన తెదేపా, జనసేన పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలున్నాయని చెప్పారు.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పడితే, అంబటి రాయుడు ఆరు రోజులనే అర్థం చేసుకొని పార్టీని వీడారన్నారు అని అన్నారు.

 

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఇప్పటికే ఆ పార్టీని వీడి తెదేపాలో చేరిన విషయం తెలిసిందే అంటూ రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు కీలక నాయకులు రానున్న రెండు మూడు రోజులలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మార్చి వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్యేలు తప్పు చేశారా అనేది చెప్పాలి… తప్పు చేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి తప్పు చేశారా అనేది కూడా స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలాని ఉద్దేశించి వైసిపి మహిళా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మీ ఇంటి ఆడపడుచుకిచ్చే మర్యాద ఏదైనా అన్నారు. ప్రజలను గమనిస్తున్నారని 100 రోజుల్లో ప్రజలు ఇచ్చే అల్టిమేట్ తీర్పు కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురు చూడాలని హెచ్చరించారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -