Jagan-Chandrababu: చంద్ర‌బాబుపై హ‌త్యాయ‌త్నం కేసు.. జగన్ దెబ్బకు చంద్రబాబుకు భారీ షాక్ తప్పదా?

Jagan-Chandrababu: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదయింది. తంబళ్లపల్లె నియోజకవర్గం ముదినేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టు సందర్శనల పేరుతో అంగళ్లు లో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారని ఫిర్యాదుతో కేసు నమోదయింది. ఈనెల 4న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, కొంగనూరులో అల్లర్లు జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తంబళ్లపల్లి నియోజకవర్గం లోని అంగళ్లు లో జరిగిన అల్లర్లకు సంబంధించి చంద్రబాబుపై ముదివేడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1 గా చంద్రబాబు, A2 గా దేవినేని ఉమలను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు అంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపిసి 120 b,147, 148, 1503, 307, 115, 109, 323, 324, 506, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చంద్రబాబుపై కేసు నమోదు చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

 

వైసీపీ వాళ్లు అల్లర్లు చేస్తే చంద్రబాబుపై కేసులు పెట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. కాగా పుంగనూరులో ఇప్పటివరకు 74 మంది టీడీపీ నేతలు కార్యకర్తలను అరెస్టు చేశారు. అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. నిజానికి అక్కడ చంద్రబాబుపై రాళ్లతో దాడి చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణగా నిలబడ్డారు కానీ చంద్రబాబు పైనే రివర్స్ కేసు పెట్టారు.

 

అది కూడా నాలుగు రోజుల తరువాత. పార్టీ నేతలు అందరి పేర్లు చేర్చడంతో ఇందులో వున్న కుట్ర స్పష్టం అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. చిరంజీవి ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు మరింతగా ప్రజల్లోకి వెళ్ళకుండా ఇలాంటి కుట్రపూరిత కేసులను తెగబడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇదే చేస్తుందని కొత్త ఏమీ లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -