Thaman: ఐ లవ్ యు నాన్న… కన్నీళ్లు పెట్టిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎమోషనల్ పోస్ట్!

Thaman:  తమన్ మ్యూజిక్ డైరెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికీ అదే కిక్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ డం ని సొంతం చేసుకుంటున్నాడు తమన్. 14 ఏళ్ల పాటు తన సంగీతం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. అఖండ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరుని సంపాదించుకున్న తమన్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

అటువంటి తమన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తమన్ ఎక్కువగా తన పర్సనల్ విషయాలని షేర్ చేసుకోరు. అయితే తాజాగా తన తండ్రిని తలుచుకొని భావాద్వేగ భాగానికి గురయ్యారు తమన్.ఆయన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మిస్ యు నాన్న మీరు మమ్మల్ని విడిచిపెట్టి 28 ఏళ్లు గడిచిపోయింది. అయినా మీరు మా చుట్టూ ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఐ లవ్ యు నాన్న అంటూ ఆయన పెట్టిన పోస్ట్ కి ఆయన అభిమానుల్నే కాదు సాధారణ ప్రేక్షకుల హృదయాలు సైతం చెమ్మగిల్లాయి.

తమన్ తండ్రి పేరు ఘంటసాల శివకుమార్, ఈయన 1997లో తుది శ్వాస విడిచి నేటితో 28 ఏళ్లు గడిచింది. ఘంటసాల శివకుమార్ 700 సినిమాలు పైగా డ్రమ్మర్ గా పనిచేశారు. ఎక్కువ చిత్రాలు చక్రవర్తి గారి వద్ద పనిచేశారు. అయితే చిన్న వయసులోనే ఆయన లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న తమన్ తన పూర్తి పేరు అయిన ఘంటసాల సాయి శ్రీనివాస్ ను కాకుండా తమన్ అనే స్క్రీన్ నేమ్ తో కెరియర్ ని స్టార్ట్ చేశారు.

అక్కినేని నాగేశ్వరరావుని వెండితెరకు పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య గారి మనవడే ఈ తమన్. ఇక ఈయన చెల్లెలు యామిని, ఈయన భార్య కూడాసింగరే, రిలేటివ్ వసంత ప్లే బ్యాక్ సింగర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో భగత్ సింగ్ కేసరి, గుంటూరు కారం, గేమ్ చేంజర్,ఓజి,నయనతార 75వ చిత్రం అయిన RT4GM చిత్రాలకి మ్యూజిక్ అందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -