Thaman: మీరు మారరా థమన్.. కాపీ కొడితే తప్ప పాటలు ఇవ్వలేరా?

Thaman: టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమన్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు తమన్. కానీ ఇటీవల కాలంలో తమన్ మ్యూజిక్ విషయంలో, బీజీఎమ్ విషయంలో భారీగా ట్రోలింగ్స్ ని విమర్శలను ఎదుర్కొంటున్నారు. కాగా మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.

సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ అంచనాలను మరింత పెంచేసాయి. అయితే బ్రో సినిమా నుంచి ఇదివరకు మై డియర్ మార్కండేయ పాట విడుదల కాగా ఇటీవల జాణవులే అనే రెండో వీడియో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ, గాయనీ ప్రణితి వాయిస్ కు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే ఈ పాటకు మ్యూజిక్ అందించిన తమన్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆయన కెరీర్ లోనే వరెస్ట్ ఆల్బమ్ అంటూ మండిపడుతున్నారు.

 

పవన్ కల్యాణ్ సినిమాకు మ్యూజిక్ ఎలా ఉండాలి అంటూ తమన్ కు సలహాలు కూడా ఇస్తున్నారు నెటిజన్లు. జాణవులే అనే పాట ప్రముఖ హిందీ ర్యాప్ సింగర్ బాద్ షా గెండా పూల్ కు కొంచెం దగ్గరగా ఉందని విమర్శిస్తున్నారు. ఇదివరకు చాలా సాంగ్స్ కాపీ కొట్టినట్లు తమన్ విమర్శలు ఎదుర్కోగా ఈ పాటను కూడా బాలీవుడ్ సాంగ్ నుంచి కాపీ కొట్టావా? అంటూ నెట్టింట్లో చర్చ పెడుతున్నారు. దీంతో ఈ ట్రోలింగ్ పై తమన్ తాజాగా స్పందించారు.ముందు నుంచి ట్రోల్స్ ఎవరు అయితే చేస్తున్నారో వాళ్లే ఇప్పుడు చేస్తున్నారు. ఈరోజు కొత్తగా ఎవరు రాలేదు. ఇక మార్కండేయ పాట తేజ్ సాంగ్. అందులో పవన్ కల్యాణ్ వస్తారు. ఆ సందర్భానికి అంతకు మించి కొట్టలేం. బ్రో సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదు అన్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -