Thaman: భగవంత్ కేసరి బీజీఎంను పవన్ మూవీ నుంచి కాపీ కొట్టిన థమన్.. ఈయన ఎప్పటికీ మారడా అనేలా?

Thaman: టాలీవుడ్ లో ఒకప్పుడు కింగ్ ఆఫ్ బిజీఎంగా పేరు తెచ్చుకున్న థమన్ ఇప్పుడు బాగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. గతంలో తన మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించగా.. ఇప్పుడు అదే మ్యూజిక్ బాగా ట్రోల్స్ బారిన పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తన మ్యూజిక్ విషయంలో ఎంత ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడో సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం.

తను కంపోజ్ చేసిన ప్రతి సినిమా విడుదలైనప్పుడల్లా ప్రేక్షకులు ఆయన అందించిన మ్యూజిక్ కాపీ అంటూ ఓ రేంజ్ లో ఏకీపారేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలలో తను కాపీ చేశాడని వార్తలు రావడంతో ఆ మధ్య థమన్ తల్లి ఆ వార్తలపై బాగా ఫైర్ అయ్యింది. అయినా కూడా జనాలు మాత్రం ఆయనను బాగా టార్గెట్ చేసి కూర్చున్నారు. ఆయన మ్యూజిక్ అందించిన సినిమా ట్రైలర్లు విడుదలైతే చాలు ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫలానా సినిమా నుండి కాపీ చేశాడని వెంటనే వీడియోస్ ద్వారా నిరూపిస్తున్నారు.

ఇక తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా థమన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా వచ్చిన ప్రాజెక్టులన్నిటికి తన మ్యూజిక్ అందిస్తూనే ఉన్నాడు. అయితే అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న భగవంత్ కేసరి మూవీకి కూడా థమన్ మ్యూజిక్ అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులందరికీ ఆ ట్రైలర్ తెగ నచ్చేసింది. కానీ కొంతమంది థమన్ మ్యూజిక్ పట్ల మరోసారి నిరాశ చెందినట్లు కనిపించారు.

ఇప్పటికే తనపై వస్తున్న ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని మరి జాగ్రత్తగా కంపోజ్ చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట కాపీ అని ముద్ర పడుతుంది. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా విషయంలో కూడా తమన్ కు అదే ఎదురైంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా మ్యూజిక్ కు అటు ఇటు చేసి బాలయ్య సినిమాకు అందించాడిని సోషల్ మీడియాలలో వీడియోల ద్వారా కాపీ కట్ అంటూ చూపిస్తున్నారు జనాలు. ఇక ఆ వీడియోలు చూసిన నెటిజన్స్ ఇది నిజమే అంటూ ఇక ఈయన ఎప్పటికీ మారడా అంటూ మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -