Naga Babu: చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే నాగబాబు తోపు.. ఆ విషయంలో గ్రేట్ అంటూ?

Naga Babu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలు అందరూ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే మెగా హీరోలు అందరూ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అలాగే సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.

ఇక వీరి తర్వాత రేసులో ముందుకు వచ్చినటువంటి వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున కూడా డిజాస్టర్ గా నిలిచింది. త్వరలో రాబోతున్నటువంటి వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాపై ఏమాత్రం అంచనాలు కూడా లేవు. ఇలా మెగా హీరోలందరూ కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తూ డిజాస్టర్ ఎదుర్కోవడంతో మెగా అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి హీరోలు నటించిన సినిమాలు డిజాస్టర్ అవుతున్నటువంటి తరుణంలో వీరిద్దరి కంటే నాగబాబు ప్రస్తుతం చాలా గ్రేట్ అంటూ మెగా ఫాన్స్ సంబరపడుతున్నారు. వీరిద్దరితో పోలిస్తే మెగా బ్రదర్ నాగబాబు ఎందులో గ్రేట్ అనే విషయాన్ని వస్తే నాగబాబు నటించిన సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడం విశేషం. నాగబాబు హీరోగా కాకుండా సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన జైలర్ అలాగే బేబీ సినిమాలలో కీలక పాత్రలలో నటించారు.

ఇలా ఈ సినిమాలన్నీ కూడా మంచి సక్సెస్ కావడంతో చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే నాగబాబు చాలా గ్రేట్ అభిమానులు భావిస్తున్నారు. అదేవిధంగా జైలర్ సినిమా సక్సెస్ కావడంతో నెల్సన్ దిలీప్ కుమార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ పై స్పందించినటువంటి నాగబాబు మీతో కలిసి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై మెగా ఫాన్స్ స్పందిస్తూ అన్నయ్య చిరంజీవికి కూడా ఇలాంటి సినిమాలు చేయమని చెప్పు అంటూ సలహాలు ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -