Naga Chaitanya: మీసం లేకపోయినా అది ఉన్న మగాడు మా నాగచైతన్య.. చై ఫ్యాన్స్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Naga Chaitanya: పుస్తకం మీద ఉన్న కవర్ ని చూసి పుస్తకం మీద ఒక అంచనాకి రావద్దు అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. అది ఇప్పుడు నాగచైతన్య ను చూస్తే నిజమే అనిపిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ ఫంక్షన్లో నాగచైతన్య మాటలు చూసిన వాళ్ళు అందరూ ఇలాగే అనుకుంటున్నారు. అతనిలో ఇంత మెచ్యూరిటీ ఉందా.. ఇంత టాకింగ్ పవర్ ఉందా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడికి అతిరథ మహారధులందరూ వచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏఎన్ఆర్ తో నటించిన చాలామంది నటీనటులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎన్ఆర్ తో వాళ్లకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా నాగచైతన్య కూడా తనకి తన తాత గారితో ఉన్న అనుబంధం గురించి,ఆయన తన జీవితంలో ఎలా అభివృద్ధి సాధించారు అనే దాని గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. మనం సినిమాలో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్కినేని అభిమానికి నా కృతజ్ఞతలు. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ మీద మీరు చూపిస్తున్న అన్ కండిషనల్ లవ్ కి నా కృతజ్ఞతలు. ఒక మనిషి ఎప్పుడు ఎవరికీ ఎలా పుడతాడు అన్నది ఎవరికీ తెలియదు.

కానీ నేను అక్కినేని మనవడుగా పుట్టడం అనేది నా అదృష్టం అనటంతో అక్కడ సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక నాగచైతన్య ఫ్యాన్స్ అయితే తమ హీరోని తలుచుకొని ఆనంద పడుతున్నారు. నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే లో అతనికి మీసం ఉండదు. మీసం లేని హీరో అంటూ అప్పట్లో తెగ ట్రోల్స్ చేశారు చాలామంది. అయితే దాన్ని మనసులో పెట్టుకొని నాగ చైతన్య ఫ్యాన్స్ ఇప్పుడు సమాధానం చెబుతున్నారు. ఆరోజు మా హీరోకి మీసం లేకపోవచ్చు కానీ గుండె ధైర్యం, గట్స్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ నెస్ ఉన్న మగాడు మా హీరో అంటూ మీసాలు మెలేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -