Nagababu: రామ్ చరణ్ ను వెనుకేసుకొచ్చిన నాగబాబు.. ఇంతకు ఏం జరిగిందంటే?

Nagababu: రామ్ చరణ్ ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. వరల్డ్ వైడ్ గా సినీ అవకాశాలు అందుకుంటూ సినిమా షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉన్నాడు. నటన విషయంలో తండ్రికి ఏమాత్రం తగ్గకుండా రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా ఒక రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. త్వరలో రామ్ చరణ్ ఆర్ సీ15 అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ బాబాయి అయినటువంటి యాక్టర్ నాగబాబు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఇండస్ట్రీలో నటుడుగా చాలా సినిమాల్లో నటించి నటన విషయంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు నాగబాబు. అలా నాగబాబు ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాగబాబు గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయంలో రామ్ చరణ్ కి సపోర్టివ్ గా మాట్లాడాడు.

అదేమిటంటే గతంలో రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లో తన కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తితో మాటల ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రామ్ చరణ్ ఆ వ్యక్తితో చిన్నపాటి మాటల ఘర్షణ చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలైంది. ఆ వీడియోను అప్పట్లో నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఈ విషయం గురించి నాగబాబు మాట్లాడుతూ చరణ్ బాబు నిజంగా అలా మాట్లాడి ఉండకూడదు. కొంచెం ఆలోచించి ఉండాల్సింది.

కానీ కుర్రాడు కదా అందుకే ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఆ టైంలో నేను ఆ వయసుకు తగ్గట్టు అలానే చేసే వాడిని అని తెలిపాడు. ప్రస్తుతం నాగబాబుకు సంబంధించిన ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -