Namrata Shirodkar: మహేష్ బాబు గురించి ఓపెన్ కామెంట్స్ చేసిన నమ్రత.. ఇంతకు అవేంటంటే?

Namrata Shirodkar: నమ్రత శిరోద్కర్ భారతీయ నటి, మాజీ మోడల్. ఈమె ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. 1993లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుంది. నమ్రత, హీరో మహేష్ బాబును వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. ఈమె మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించి ఆరవ స్థానంలో నిలిచింది.

అదే సంవత్సరం మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్ గా నిలిచింది. ఈమె మొదటి చిత్రం అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన పురబ్ కి లైలా పచ్చిమ్ కానీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. 1988లో జబ్ ప్యార్ కిస్ సే హోతా హైలో చిన్న పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఆమె నటించిన వాస్తవ్, కచ్చేదగే సినిమాల ద్వారా మంచి గుర్తింపు, ప్రశంసలు అందుకొని వరుస అవకాశాలతో ముందుకు కొనసాగింది. ఇక తెలుగులో 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో నటించి మహేష్ బాబుతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. 2004 వరకు హిందీ చిత్రాలలో, ఒకటి రెండు తెలుగు చిత్రాలలో నటించి సినిమాలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుంది.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో తనకు మహేష్ బాబు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఎదురయింది. అందుకు తాను మహేష్ బాబు ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎక్కువగా ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. ఎక్కువ సమయం తనతో పిల్లలతో గడపడానికి ఇష్టపడతాడు అని తెలిపింది.

ఇక మహేష్ సినిమాల విషయంలో తాను జోక్యం చేసుకోనని తెలిపింది. మహేష్ సెలెక్ట్ చేసుకునే కథలు అతను చెబితేనే వింటానని తనే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. కథల విషయంలో తన డెసిషన్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. ఇక మహేష్ సినిమాలలో పోకిరి, ఒక్కడు, మురారి సినిమాలు తనకు ఎంతగానో నచ్చాయని చెప్పడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -