Nandamuri Balakrishna: బాలయ్యకు రెండో ఫ్యామిలీ.. చంద్రబాబు ముందు చెప్పేశాడుగా!

Nandamuri Balakrishna: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలు వరుసబెట్టి చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అదే సమయంలో ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు హోస్ట్ గా మారి ఆహా యాప్ లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోను నడిపిస్తున్నాడు. అన్ స్టాపబుల్ షోకు ప్రముఖ నటీనటులు, సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు బాలయ్య. గతేడాది మొదటి సీజన్ ముగించి, ఈ ఏడాది రెండో సీజన్ కూడా స్టార్ట్ చేసేశాడు.

తాజాగా అన్ స్టాపబుల్ షో ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇందులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి షూట్ చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. దీంతో ప్రోమో వదిలిన కొన్ని గంటల్లోనే మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. అయితే, బాలయ్య మొదటి సీజన్ సరదాగా సినీ ప్రముఖులతోనే నడిపించాడు. ఈసారి ఏకంగా మాజీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఈ షో అంతా పొలిటికల్ ఇంటర్వ్యూలాగా మారిపోతుందనుకున్నారు ఫ్యాన్స్.

అయితే, బాలయ్య తనదైన శైలిలో ప్రోమోలో కనిపిస్తారు. ఫ్యాన్స్ థింకింగ్ మారిపోయేలా చేశారు. దీంతో వీరిద్దరూ రాజకీయ నేతల్లా కాకుండా బావా బామ్మర్దులుగా మారిపోయి సరదాగా మాట్లాడుకున్నారు. సినీ తారలను ఆట పట్టించినట్లుగానే బాలకృష్ణ తన బావ చంద్రబాబును ఆటపట్టించడం ప్రోమోలో చూడొచ్చు.

అన్ స్టాపబుల్ అనే పదానికి నిజమైన అర్థం చెప్పాడంటూ బాలయ్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షోను తన రెండో ఫ్యామిలీగా అభివర్ణించారు బాలయ్య. తనకు రెండు ఫ్యామిలీలున్నాయని, ఒకటి రోడ్ నంబర్ 45లో వసుంధర, పిల్లలు.. రెండోది గతేడాది మొదలైంది.. డీప్ గా కనెక్ట్ అయ్యింది.. అంటూ అన్ స్టాపబుల్ షో గురించి చెప్పాడు బాలయ్య. దీంతో వెంటనే చంద్రబాబు అందుకొని ఏదీ.. ఈ మాట వసుంధరకు ఫోన్ చేసి చెప్పు చూద్దాం.. అంటూ పంచ్ వేశాడు. దీనికి అందరూ పగలబడి నవ్వుతారు. ఇలా సాగిపోయింది ఆ ప్రోమో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -