NBK107: అఖండ సినిమాను మించి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న బాలయ్య 107?

NBK107: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ కొన్ని దశాబ్దాల కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ 100కు పైగా సినిమాలలో నటించాడు. ఇటీవల బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ద్వారా బాలకృష్ణ తన జీవితంలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.

కరోనా సమయంలో విడుదలైన అఖండ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా అఖండ సినిమాని వెనక్కి నెట్టేలా ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బాలకృష్ణ 107 సినిమా నైజం హక్కులు 20 కోట్లకి అమ్ముడు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సీడెడ్ లో బాలకృష్ణ సినిమా గురించి టాక్ ఎలా ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ ఎన్.బి.కె 107 సినిమా బిజినెస్ కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో విడుదలైన అఖండ సినిమా 10 కోట్ల వరకు బిజినెస్ చేసి దాదాపు 17 కోట్ల షేర్ కలెక్షన్ అందించింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ఎన్బికె 107 సినిమాకు సీడెడ్ ప్రాంతంలో దాదాపు 14 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి దాదాపు 37 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాలయ్య అఖండ సినిమా రికార్డులను బ్రేక్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -