Shruti Haasan: అలాంటి పనులు చేయాలని ఆశగా ఉండేది.. శృతి హాసన్ కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Shruti Haasan: కమల్ హాసన్ కుమార్తెగా ఆయన సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. ఈ ఏడాది మొదట్లో చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. ఇలా రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి శృతిహాసన్ త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది ఇదిలా ఉండగా శృతిహాసన్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీకు టాటూలు అంటే చాలా ఇష్టమా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాకు టాటూలు అంటే చాలా ఇష్టం. బహుశా నేను హీరోయిన్ కాకపోయి ఉంటే నా వొళ్ళంతా కూడా టాటూలు వేయించుకునే దాన్ని అంటూ సమాధానం చెప్పారు.

ఒకవేళ మీరు సెలబ్రిటీ కాకపోయి ఉంటే ఏం చేసేవారు అనే ప్రశ్న కూడా ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తను చిన్నప్పుడు సేల్స్ గర్ల్ అవ్వాలని కోరుకున్నాను పెద్దయిన తర్వాత తాను ఇలా సేల్స్ గర్ల్ గా మారిపోయి తన పని చేసుకోవాలని అనుకున్నాను కాకపోతే హీరోయిన్ గా మారిపోయానని ఈమె తెలియజేశారు.

ఇలా సేల్స్ గర్ల్ అవ్వాలన్న ఉద్దేశంలో ఉన్న తాను ఏదైనా షాపింగ్ కోసం వెళ్తే అక్కడ సేల్స్ గర్ల్స్ లేదా బాయ్స్ తో గంటల తరబడి మాట్లాడుతూ ఉండేదానినని ఇక హీరోయిన్ అయిన తర్వాత అలవాటు మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మీ ప్రియుడితో మీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా ఈమె సమాధానం చెబుతూ ఇది తనకు బోరింగ్ క్వశ్చన్ అంటూ ఆన్సర్ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -