Nani: నాని ఇంత వేస్టా.. ఆ రెండు యాప్స్ ను వాడలేడా?

Nani: టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. ఇకపోతే హీరో నానికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో నానికి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాగా నాని కెరియర్ విషయానికి వస్తే.. నాని హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నాని చివరగా గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమా తో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇటీవలే మార్చి 30వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.

కీర్తి సురేష్ అలాగే నాని ఇద్దరు కూడా మాస్ లుక్ లో కనిపించారు. సినిమాలో ఇద్దరి నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో నాని మాటలు విన్న అభిమానులు నెటిజన్స్ నిజమా అంటూ షాక్ అవుతున్నారు. ఆ వీడియోలో జబర్దస్త్ కమెడియన్ కొమరం ఇంటర్వ్యూ చేస్తూ గూగుల్ పే, ఫోన్ పే గురించి ప్రశ్నించగా వాటి గురించి స్పందించిన నాని తనకు ఆ గూగుల్ పే, ఫోన్ పే ఎలా వాడాలో కూడా తెలియదు తెలిపాడు. ఆ మాటలకు పక్కనే ఉన్న కీర్తి సురేష్ షాక్ అయింది.

నిజమా అని అడగగా సీరియస్ నాకు ఫోన్ ఉపయోగిస్తాం కానీ ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ సంబంధించి అలాగే స్విగ్గి జొమాటో ఫోన్ పే వంటి వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు అని తెలిపారు నాని.. ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తాను అంటే ఇదిగో తీసుకోండి అని మొబైల్ చేతిలో పెడతాను అని నవ్వుతూ తెలిపారు నాని.. అదేంటి నాని హీరో అయి ఉండి ఫోన్ పే గూగుల్ పే గురించి తెలియక పోవడం ఏంటి అవి కూడా చేతకాదా అంటూ కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -