Child Artist: ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?

Child Artist: తమిళ నటుడు విక్రమ్ గురించి తెలుగు వారికి కూడా సుపరిచితమే. వైవిధ్య భరితమైన చిత్రాలను ఎంచుకోవడంలోనూ, కథల ఎంపికలోనూ విక్రమ్ ది ప్రత్యేక శైలి. ఈయన తాజాగా నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాలో విక్రమ్ అత్యద్భుతంగా నటించారు. నటనపై తనకున్న మక్కువను పదే పదే నిరూపించుకుంటూ ఉంటారు విక్రమ్. అందుకే తమిళ సినిమాలో విక్రమ్ టాప్ లిస్టులోనే ఉంటారు.

విక్రమ్ నటించిన పొన్నియన్ సెల్వన్.. ఏకకాలంలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో సెప్టెంబర్ 30న విడుదలైంది. విక్రమ్ తో పాటు సినిమాలో కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాశ్ రాజ్ వంటి అగ్ర నటలు నటించారు. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.

విక్రమ్ నటించిన సినిమాల్లో తెలుగులో చాలా చిత్రాలు విజయవంతంగా ఆడాయి. వాటిలో నాన్న చిత్రం ప్రత్యేకమైంది. ఈ సినిమాలో విక్రమ్ కుమార్తెగా నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, అదే పాప ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో విక్రమ్ కు క్రష్ గా నటించింది. ఇలా నటించడంపై భారీగా మీమ్స్ వస్తున్నాయి.

డాటర్ పాత్రలో ఒదిగిపోయిన ఆ పాప.. ఇప్పుడు విక్రమ్ క్రష్ గా కనిపించడం చర్చనీయాంశంమైంది. కథలో బలం ఉంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దీనికి నిదర్శనంగా చాలా చిత్రాలు ఇటీవల విడుదలై విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఎంత కథలో బలమున్నా ఆర్టిస్టులను సరైన క్యారెక్టర్ లో తీసుకోవడం కూడా ముఖ్యమేనని ప్రేక్షకులు అంటున్నారు. ఓ సినిమాలో ఓ పాత్రలో ఊహించుకున్న క్యారెక్టర్ మరో సినిమాలో ఇంకోలా ఊహించుకోవాలంటే అందరికీ మింగుడు పడదు. అయితే, తండ్రీకూతురు, తల్లీకొడుకు పాత్రలు వేసి.. తర్వాత వారినే క్రష్ లుగా చూపిండం అంత సబబుగా ఉండదేమో అనేది ప్రేక్షకుల వాదన.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -