Ponniyin Selvan: బాహుబలిని క్రాస్ చేస్తామంటున్న కోలీవుడ్!

Ponniyin Selvan: తెలుగు ప్రేక్షకులకు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మూవీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద హిట్ ను ఈ సినిమా తన సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమాను చూసి కొన్ని ఇండస్ట్రీలు కుళ్ళుకున్నాయని చెప్పవచ్చు. ఇలాంటి సినిమా మన ఇండస్ట్రీ నుండి ఎందుకు రాలేదు అని కూడా చాలామంది అనుకున్నారు. ఆ రేంజ్ లో సినిమాను నిర్మించాలని కూడా కొన్ని ఇండస్ట్రీలు అనుకున్నాయి.

నిజానికి ఈ స్థాయిలో బాహుబలి సినిమా గుర్తింపు సంపాదించుకోవడం తెలుగు ఇండస్ట్రీ అదృష్టం అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా బాహుబలి స్థాయిలో ఎన్ని సినిమాలో వచ్చినప్పటికీ.. బాహుబలి రేంజ్ ను కొద్ది మొత్తంలో కూడా తాకలేకపోతున్నాయి. అయితే ఇండస్ట్రీలో బాహుబలి లాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ బాహుబలి తో సమానం అనిపించుకోలేదు.

ఇక తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం రెండు పార్ట్ లతో రానున్న పొన్నియన్ సెల్వన్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాడు. కాగా ఈ సిరీస్ త్వరలో పేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన కోలీవుడ్ ఆడియన్స్ ఆ సినిమాను ఒక అద్భుతం లా ఊహించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి వేసే అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి.

నిజానికి ఈ సినిమాలు ట్రైలర్ కోలీవుడ్ ఆడియన్స్ కి తప్ప ఇతర ఇండస్ట్రీకి అంతగా టచ్ అవ్వలేదని చెప్పవచ్చు. కానీ కోలీవుడ్ సినీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ముందు బాహుబలి బొక్కలా ఉంటుందని మరి కొందరు నాటుగా మాట్లాడుతున్నారు. నిజానికి బాహుబలిని క్రాస్ చేయాలంటే 18 కోట్లు కొల్లగొట్టాలి. మరి ఈ విధంగా కోలీవుడ్ సినిమా వల్ల అవుతుందో లేదో చూడాలి. మీరు కూడా ఆ కోలీవుడ్ మణిరత్నం సినిమా ట్రైలర్ ను ఒకసారి చూసేయండి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -