Jagan: జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్న ష‌ర్మిల – విజ‌య‌మ్మ -బ్ర‌ద‌ర్ అనిల్‌.. భారీ షాకంటూ?

Jagan: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ తో కలిసి రాజకీయంగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ లో చేరిక పైన మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో చేరిన తరువాత ఏపీలోనూ తిరిగేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. సోనియా గాంధీ, రాహుల్, విజయమ్మ, షర్మిల అందరూ కలిసి ఏపీలో తిరిగితే ఏపీలో వైసీపీ గల్లంతవుతుందని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ మాటల్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికలలో తల్లి చెల్లెలు జగన్ కి వ్యతిరేకంగా పోరాడుతారనే కదా అర్థం. బ్రదర్ అనిల్ కుమార్ కూడా జగన్ తరఫున ప్రచారానికి ఇష్టపడటం లేదు. నిజానికి పార్టీ పెట్టిన దగ్గరనుంచి గత ఎన్నికలలో గెలిచే వరకు తిండి నిద్ర లేకుండా అహర్నిశలు కష్టపడ్డారు విజయమ్మ, షర్మిల. అన్న కోసం చెల్లెలు షర్మిల రికార్డు స్థాయిలో పాదయాత్ర చేసింది. బై బై బాబు అనే నినాదంతో ఆడ సింహంలా గర్జించింది.

అలాగే బ్రదర్ అనిల్ కుమార్ వల్ల క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించిన ఓట్లు అన్నీ పోగయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఓట్లు ఆశించడం కొంచెం కష్టమే. అలాగే చంద్రబాబుని అరెస్టు చేసి కొన్ని వర్గాల వారికి శత్రువు అయిపోయాడు జగన్. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురందరేశ్వరి కూడా ఈసారి గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది.

ఇలాంటి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో జగన్ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇదే అదనుగా భావించిన జగన్ వ్యతిరేకవర్గం వారు జగన్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. అయిన వాళ్ళను కూడా దూరం చేసుకుంటే ఆఖరికి మిగిలేది ఇదే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ చంద్రబాబుని అరెస్టు చేయించిన జగన్ వచ్చే ఎన్నికలలో తన సీటుకే ఎసరు తెచ్చే పరిస్థితిని తెచ్చుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -