Sharmila-Vijayamma: షర్మిల – విజయమ్మ ఏపీని వీడటం వెనుక అసలు నిజాలివేనా.. అసలేం జరిగిందంటే?

Sharmila-Vijayamma: రాజకీయ నాయకులు విమర్శలు ఎలా ఉంటాయంటే అవి వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా ఉంటాయి. అయినా గెలుపే పరమావధిగా పనిచేసే రాజకీయ నాయకులకు అవేమీ పట్టవేమో. ఎదుటివారి ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడతారు అనే ఆలోచన ఎందుకు రాదో అర్థం కాదు. అలాంటి వారిలో పేర్ని నాని ముందు వరుసలో ఉంటాడు. రాజకీయ భవిష్యత్తు కోసం తన కులాన్ని కూడా కించపరచడానికి ఆలోచించడు నాని.

అతని విమర్శలు ఎప్పుడూ జగన్ కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. పేర్ని నాని ఒక్కడే కాదు వైసీపీ నేతలు చాలామంది ఈ కోవలోకి వస్తారు. పవన్ ను కించపరచాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తల్లి ఒక రెల్లి కులస్తురాలు అంటూ అప్పట్లో ఒక వైసీపీ నేత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాంతో జగన్ కుటుంబ పునాదులను తవ్వి తీశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ ఆర్ ఆర్ ఆర్. పవన్ ఇంట్లో ఆడవారిపై విమర్శలు చేసి బోర్ కొట్టిందేమో కానీ ఇప్పుడు చంద్రబాబు కుటుంబం పై పడ్డారు వైసీపీ నేతలు.

అయితే తమకు ప్రత్యర్థి అని భావిస్తే సొంత బాబాయి కూతురు, సోదరి అని కనికరం చూపించే ప్రశ్న లేదు అని వివేక కూతురు సునీత రెడ్డి విషయంలో జగన్ ఇప్పటికే నిరూపించారు. గతంలో భువనేశ్వరి బ్రాహ్మణితో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని, ఆ ఇంటి గుట్టంతా ఇంట్లో పని వాళ్ళకి తెలుసని ఒక వైసీపీ ఎంపీ కట్టుకథ సృష్టించారు. అయితే ఇతర పార్టీ ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జగన్ కుటుంబం గురించి కూడా అవతలి వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు ఇతర పార్టీ వాళ్లు కూడా జగన్ గురించి అలాగే మాట్లాడుతున్నారు.

2012 నుంచి 2019 ఎన్నికల ప్రచారం వరకు జగన్ తన తల్లి సోదరిని రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారు. తర్వాత వారిని యూస్ అండ్ త్రో మాదిరిగా రాష్ట్రం నుంచి తరిమేశారు. జగన్ తల్లి చెల్లి తాడేపల్లి పాలస్ నుంచి ఎవరు వేధింపులు తాళలేక పక్క రాష్ట్రానికి వెళ్లిపోయారో అందరికీ తెలిసిందే అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా ప్రత్యర్థి కుటుంబాల ఆడవారిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలు మానుకుంటే మంచిది అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -