Nara Brahmani: నారా బ్రాహ్మణి ఆ విషయంలో గ్రేట్ కదా.. ఏం జరిగిందంటే?

Nara Brahmani: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వర్గీయ ఎన్టీ రామారావు వారసులుగా ఆయన పిల్లలు, మనవళ్లు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఎన్టీ రామారావు నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా వ్యవహరించిన నందమూరి తారక రామారావు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు.

ప్రస్తుతం నందమూరి తారక రామారావు కొడుకు బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నప్పటికీ రాజకీయపరంగా బాలకృష్ణకు సరైన అవగాహన లేదు. అంతేకాకుండా ఎన్టీ రామారావు పిల్లలైనా పురుందేశ్వరి హరికృష్ణ వంటి వారు కూడా రాజకీయాలలో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తండ్రి అంత గుర్తింపు పొందలేకపోతున్నారు. ప్రస్తుతం నందమూరి కుటుంబంలోని వారసులంతా సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్నారు.

 

ఎవరు కూడా వ్యాపార రంగంలో రాణించటానికి ఆసక్తి చూపటం లేదు. అయితే అటు నందమూరి కుటుంబానికి ఇటు నారావారి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు పెంచడంలో బాలకృష్ణ కూతురు బ్రాహ్మిని కీలక పాత్ర పోషిస్తుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు.బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పట్టా అందుకున్న నారా బ్రాహ్మణి స్వదేశానికి తిరిగి వచ్చి తండ్రి చెప్పినట్లు లోకేష్ ని వివాహం చేసుకొని అటు మామ చంద్రబాబు నాయుడు వ్యాపారాలతో పాటు ఇటు తండ్రి వ్యాపారాలను కూడా చక్కగా నిర్వర్తిస్తోంది.

 

చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నారా బ్రాహ్మిని ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో కూడా బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తూ మహిళా వ్యాపారవేత్తగా ముందుకి దూసుకుపోతుంది. భర్త మామ రాజకీయ రంగంలో బిజీగా ఉండటంతో నారా బ్రాహ్మణి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేయడానికి దేశ విదేశాలు తిరుగుతూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -