Nara Brahmani: భారం అంతా బ్రాహ్మణి భుజాల మీదే.. సీఎం జగన్ కు బ్రాహ్మణి పోటీ ఇవ్వడం సాధ్యమేనా?

Nara Brahmani: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి జైల్లో ఉన్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తండ్రిని విడిపించుకోవడం కోసం ఢిల్లీ వెళ్లే అక్కడ పెద్దలతో మాట్లాడుతూ తన తండ్రిని విడిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఫలించలేదు. అయితే తన తండ్రిని కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేశారు అంటూ జాతీయ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇలా ఢిల్లీకి వెళ్లినటువంటి లోకేష్ తిరిగి తన పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. అయితే ఈయన ఆంధ్రాలోకి అడుగుపెడితే అరెస్టు చేయడానికి సిఐడి అధికారుల సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కేలం స్కిల్ డెవలప్ స్కామ్ లో అరెస్ట్ కాగా లోకేష్ మాత్రం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలాగే ఫైబర్ నెట్ స్కామ్ లో కూడా భారీగా అక్రమాలకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయనని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియడం లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు.

తెలుగుదేశం పార్టీని నడిపించే కీలక నేతలే దూరంగా ఉండటంతో పార్టీ బలహీనపడుతుంది దీంతో లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీ కీలక నేతలతో మాట్లాడుతూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. నారా బ్రాహ్మణి భువనేశ్వరి కూడా బయటకు వస్తూ పార్టీని కార్యకర్తలను ధైర్యంతో ముందుకు నడిపిస్తున్నారు. అయితే భువనేశ్వరి వయసు పై పడటంతో ఈమె బహిరంగంగా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనలేక పోతున్నారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ బరువు బాధ్యతలు మొత్తం నారా బ్రాహ్మినిపైనే పడ్డాయి దీంతో ఈమె పార్టీ బరువు బాధ్యతలను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు.ఇంతకాలం ఆమె రాజకీయాలలో లేనప్పటికీ మావగారు, భర్త ద్వారా టిడిపి గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి పూర్తి అవగాహన పొందారు. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఈమె ప్రతి ఒక్క విషయం గురించి ఎంతో అనర్గంగా మాట్లాడగలరు దీంతో పార్టీ పరువు బాధ్యతలను ఈమె తన చేతులలోకి తీసుకుపోతున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -