Koneti Adimulam: పెద్దాయన కుట్ర చేశారు.. కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు!

Koneti Adimulam: వైకాపా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తన అక్కసు వెళ్ళగక్కారు. వైకాపా పార్టీలో మేమందరం ఉన్నాము కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత పార్టీ లాగా భావిస్తున్నారు. నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండకూడదని కుట్ర పన్నుతున్నారు. ఆయనను విమర్శించినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం సేవలందించిన నాపై కక్ష కట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలం.

 

నాకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పటం నేరమా, ఎక్కడైనా సరే ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఉండలేం కదా అంటూ తన బాధనంతా వెళ్ళగక్కారు. ఎమ్మెల్యే టికెట్ లేకుండా చేశారు, ఎంపీగా కూడా ఉండకూడదని పెద్దాయన నాపై కుట్ర పన్నారు. నాకు సమాచారం ఇవ్వకుండా గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గం లో రెండు రోజులు పర్యటించారు అయినా బాధపడలేదు కానీ ఈనెల 27న తిరుపతిలో నా నియోజకవర్గ ఆత్మీయ సదస్సు ఎందుకు పెట్టారు అనే అంశంపైనే మాట్లాడాను.

అలా చేసినందుకు నన్ను తిట్టాలని ద్వితీయ శ్రేణి నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉంటాను తప్ప ఎంపీగా ఉండనని సీఎంతో చెప్పాను. ఈ విషయం మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలతో సహా అందరికీ తెలుసు. చివరికి పెద్దిరెడ్డి ఇంటికి కూడా వెళ్లాను. అవమానం భరించలేకపోతున్నాము,ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని కోరితే మన చేతుల్లో ఏముంది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని సమాధానం ఇచ్చారు అని వాపోయారు ఆదిమూలం.

 

తాజాగా కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు కోనేటి సుమన్ కుమార్ ఇద్దరూ మంగళవారం హైదరాబాదులో నారా లోకేష్ ని కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించి తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని తెలిపారు. రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు ఆదిమూలం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -