YCP: వైసీపీ నేతలకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా.. ఏం జరిగిందంటే?

YCP: ప్రస్తుతం ప్రతీ రాజకీయా పార్టీలకు అనుకూలంగా కొన్ని పత్రికలు, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్‌లో ఆయా పార్టీ నేతలను భుజానా వేసుకొని ఊరేగుతాయి. ప్రత్యర్థి పార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలతో వార్తలు రాస్తాయి. కానీ, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ విమర్శలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. అది కూడా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ అనుబంధ సోషల్ మీడియా అని చాలా మంది చెబుతారు. అయితే, పార్టీ గెలుపు కోసం కృషి చేయడంలో తప్పు లేదు కానీ.. పక్క పార్టీ వాళ్లను వ్యక్తిగతంగా కించపరడం తప్పు. కానీ, ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఆరితేరిపోయిందనే చెప్పాలి. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి, లోకేష్ బాడీ సేమింగ్ గురించి తరచూ పోస్టులు పెట్టి వైరల్ చేస్తూ ఉంటుంది.

 

జనవరి 23న నారాలోకేష్ బర్త్ డేకి చాలా మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విషెస్ చెప్పారు. పాదయాత్రతో రాజకీయాల్లో తనదైన మార్క్ వేసుకున్నాని పవన్.. లోకేష్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే చాలా మంది సోషల్ మీడియాలో విష్ చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా నారా లోకేష్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చాలా అభ్యంతర కరంగా ఉన్న ఈ పోస్టుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే పప్పు లోకేష్ అంటూ పాలడబ్బా, బిస్కెట్లు, హార్లిక్స్ ఫోటోలను షేర్ చేసింది.

విలువలు, విశ్వసనీయత అంటూ గొప్పగొప్ప పదాలతో పదేపదే చెప్పే జగన్ ఇలా పోస్టులు పెట్టేవారిని సపోర్టు చేస్తారా చెప్పాలి. జగన్ బర్త్ డే రోజున చంద్రబాబు, పవన్, లోకేష్ ఆయనకి గౌరవంగా విషెస్ చెప్పారు. రాజకీయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వ్యక్తిగతమైన జీవతంలో ఒకరిపట్ల మరొకరు గౌరవాన్ని ప్రదర్శించాలి. అలాంటప్పుడే ప్రజలకు మంచి సందేశం వెళ్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే.. దానికి జగన్ బాధ్యత వహించాలి. టీడీపీ సోషల్ మీడియాలో పెడితే దానికి చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలి. అవి వారు చేస్తున్నట్టు పోస్టులుగానే భావించాల్సి ఉంటుంది. లక్షల మందికి ప్రతినిధిగా ఉన్న వారు ఇలా చేస్తే.. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

ప్రజలకు సందేశం ఇవ్వడం సంగతి అంటుంచితే.. ఎన్నికలకు ముందు ఇలాంటి రెచ్చ గొట్టేపోస్టులు ఏమాత్రం మంచిది కాదని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇవి అల్లర్లకు దారి తీసే ప్రమాదం ఉంది. టీడీపీ నేతలు కూడా లోకేష్ పై చేసిన పోస్టుల విషయంలో ఇదే చెబుతున్నారు. ఎవరి బీపీలు పెంచడానికి వైసీపీ ఇలాంటి దిగజారుడు పోస్టులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రెచ్చ గొట్టే చర్యలకు రియాక్ట్ అయితే, టీడీపీ కార్యాలయాలపై దాడి చేశారని గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి దాడులు చేయాలని చూస్తున్నారా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతులు మారినపుడు మేం కూడా ఇలాంటి దాడులకు దిగితే ఊరుకుంటారా అని నిలదీస్తున్నారు. కాబట్టి రాజకీయాలను గౌవరంగా చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -