Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తే వారు సమాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారనే దానిపై ఫోకస్ చేశారు. ఇటీవలే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించారు. అది కూడా సీఎం అయిన తర్వాత తొలి సంతకం డీఎస్పీ నోటిఫికేషన్ కోసమే చేస్తానని అన్నారు. తొలి 60 రోజుల్లోనే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. అంతేకాదు.. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనే తన లక్ష్యమని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారు. చేనేత కార్మికులు ఇప్పుడిప్పుడే ఆదునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. చేనేత రంగం ఆర్ధికంగా కుదేలవుతోంది. దీనికి తోడు వెస్ట్రన్ స్టైల్ కు అలవాటు పడిన జనం చేనేత వస్త్రాలపైవు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి టైంలో ఆదునిక యాంత్రాలు, కరెంట్ అవసరాలు అంటే బడ్జెట్ మరింతగా పెరుగుతుంది. అందుకే, చంద్రబాబు వారికి అద్భుతమైన హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమలవుతుంది కానీ.. 200 యూనిట్లు వరకే ఉంది. దేశంలో మొట్టమొదటిసారి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే జరిగితే.. చేనేత కార్మికులకు కొన్ని కష్టాలు తీరినట్టే. వాళ్ల ఉత్పత్తికి మార్కెటింగ్ చేసుకోగలిగితే.. ఎక్కువ ప్రొడక్టును తయారు చేయొచ్చు.

ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు పలమనేరులో ఈ హామీ ఇచ్చారు. రాయలసీమనలో చేనేత కార్మికులు ఎక్కువ. అందుకే, వారికి ఈ హామీ ఇచ్చారు. అంతేకాదు.. రాయలసీమకు టీడీపీ హయంలో ఏం చేశారో గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించింది టీడీపీ అని తెలిపారు. నీటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ మొదలు పెడితే.. తాను అభివృద్ధి చేశానని చెప్పారు. అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొని వచ్చానని గుర్తు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. ఇప్పుడు సిద్ధం పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్దం అవుతున్నారని మండిపడ్డారు. జగన్ ను రాయలసీమలో అడుగుపెట్టొద్దని పిలుపునిచ్చారు. రాయలసీమకు ఏం చేశాలో సీఎంను నిలదీయాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. బాదుడే బాదుడు, చెత్తపన్నులు, ప్రమాదకరమైన మద్యం, గంజాయి సాగుతప్ప రాష్ట్రానికి జగన్ చేసిందేమీ లేదని అన్నారు. గత ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 49 స్థానాలు వైసీపీకి ఇచ్చారని.. కానీ, ఆయన మీకేమిచ్చారని ప్రశ్నించారు. మే 13తో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే రాష్ట్రంలో కొండలు, గుట్టలు కనిపించవని ప్రజలను అలెర్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -