Nara Lokesh-Pawan Kalyan: ప‌వ‌న్‌, లోకేశ్ క‌లిస్తే ద‌బిడి ద‌బిడే.. ఏపీలో పొలిటికల్ గా భారీ సంచలనాలు ఖాయమా?

Nara Lokesh-Pawan Kalyan:  వైసిపి పార్టీ ప్రకారం చంద్రబాబుకి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ రెండు కళ్ళ లాంటి వారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకమైతే వైసిపి పార్టీ పరిస్థితి ఏంటో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. తను ఖైదీగా 40 రోజులకు పైగా ఉన్నా కూడా ఇప్పటికీ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఇంకెన్ని రోజులు జైల్లో ఉంటారో కూడా అంచనా వేయలేము.

పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తిరిగి బయటకు వచ్చి టిడిపి తో సమన్వయం కుదుర్చుకొనే ఆలోచన కూడా పెట్టారు. అయితే మరోవైపు నారా లోకేష్ కూడా అదే మంచి నిర్ణయం అని అనుకుంటున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు ఏకమైతే వైసీపీ నీ ఓడించే ప్రయత్నాలు బలమవుతాయి. దీనికోసం ఇద్దరూ సమన్వయ సమావేశం పెట్టుకోవడానికి ఇరు పార్టీల వైపు నుంచి ఐదుగురు పెద్దమనుషులను తీసుకొని వచ్చి అక్టోబర్ 24న మధ్యాహ్నం రెండు గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశారు.

మరి వీరిద్దరి కలయిక జగన్ కి ఎంతవరకు నష్టం తెప్పిస్తుందో లేక జగన్ వీరిద్దరి మధ్య దూరాన్ని ఎలా పెంచుతాడో చూడాలి. ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంలో ఉంటాడో ఎప్పుడు సినిమా షూటింగ్లలో ఉంటాడో తెలీదు. మెరుపుతీగలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు నారా లోకేష్ తండ్రి అరెస్టు అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయాడు అని చెడ్డ పేరు ఉంది. ఈ రెండిటిని వాడుకొని జగన్ ఏవైనా ముందడుగు వేయగలడా?

లేకపోతే వీళ్లిద్దరూ కలిసి జగన్ నే వెనకడుగు వేపించగలరా అనేది చూడాలి. కానీ జగన్ ని అడ్డుకోవాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాల్సిందే. చంద్రబాబు నాయుడు రంగంలోకి రావాలంటే తను జైల్లో నుంచి బయటకు రావాలి. ముందు వీళ్ళిద్దరూ చంద్రబాబు నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తే అప్పుడు జగన్ కి చంద్రబాబు కి మధ్య ఎవరు గొప్ప అనేది తేలిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -