Nara Lokesh: నాన్నకు ప్రేమతో పార్టీకి వెన్నుదన్నుగా మారిన లోకేశ్.. అప్పుడు పప్పు అన్నవాళ్ల నోరు మూయించేలా?

Nara Lokesh:  టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాబు అరెస్టు ఒకసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తండ్రి అరెస్టుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కు నిద్ర లేదు,సమయానికి భోజనం కూడా చేయడం లేదు. తన తండ్రిని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అని ఆలోచనతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది న్యాయవాదులను కూడా కలిశారు. కనీసం తండ్రిని చూడడానికి కూడా పోలీసులు అనుమతించకపోవడంతో లోకేష్ కు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.

కొన్ని గంటల పాటు కింద కూర్చొని మరీ ఆయన న్యాయపోరాటం చేశారు. సెక్షన్ ల వల్లె వేస్తూ పోలీసులను గడగడలాడించారు. తన తండ్రిని చూసేందుకు తనకు రైట్ లేదా? అంటూ పోలీసులను నిలదీశారు. నాన్న కోసం నాన్నకు ప్రేమతో నారా లోకేష్ ఒక యుద్ధమే చేస్తున్నారు. ఇక నారా లోకేశ్ ని పప్పు అన్నారు. మంగళగిరి కూడా పలకడం రాదంటూ ఎద్దేవా చేశారు. బాడీ షేమింగ్ చేశారు. కానీ ఏ రోజు కూడా తనను అలా విమర్శించే వారిపై విమర్శలు చేయలేదు వారిపై కోప్పడలేదు.. అలా అని భయపడలేదు. అంతకుమించి కృంగిపోలేదు. పైగా ఇప్పుడు పార్టీకి అన్నీ తానే అయ్యారు. నిన్న ఉదయం తండ్రిని కలిసి ఆయనతో మాట్లాడారు. సాయంత్రానికి ఢిల్లీకి బయలు దేరారు. రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు. తిరిగి పొద్దుటే పనుల్లో బిజీ అయిపోయారు.

జాతీయ మీడియాతో తన తండ్రి అరెస్ట్ విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. అలాగే ఏపీలో తాజా పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించాలనేదే ప్రస్తుతం ఆయన తక్షణ కర్తవ్యం. అలాగే తన తండ్రిపై మోపిన అక్రమ కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించాలి. ఒకవేళ ఏసీబీ కోర్టు, హైకోర్టులలో చంద్రబాబుకు బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టులో టీడీపీ న్యాయ పోరాటం చేయనుంది. దీంతో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడనున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -