Nara Lokesh: ఓటమి తేలిపోవడం వల్లే జగన్ దుర్మార్గపు చర్యలు.. నారా లోకేశ్ కామెంట్లకు సమాధానం ఉందా?

Nara Lokesh: ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయిపోయింది .ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరిద్దరు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి తరుణంలో విజయం వీరిదేనని వైసీపీ పార్టీకి ఓటమి తప్పదని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి.

ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటమి భయం పట్టుకోవడంతో తన ముసుగు తీసేసి అసలు రూపం బయట పెట్టారు వైసిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను దాడులను భరించలేక నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కీలక వైసిపి నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్ తన అసలు రూపం బయటపెట్టారంటూ లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పలువురు వైసిపి కీలక నేతలు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి పార్టీలోకి చేరారు. అది చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన విశ్వరూపం బయటపెట్టారు. ఈ క్రమంలోనే తనకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది పోలీసులను టిడిపి నేతలపై దాడికి పంపించారని ఈయన ఆరోపణలు చేశారు.

మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ వెలవడుతున్నటువంటి తరుణంలో పోలీసులు జగన్ కు తొత్తులుగా మారిపోయారని,సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని జగన్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపాలని లోకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -