Nara Lokesh: వైసీపీ మ‌ళ్లీ వ‌స్తే.. రాయ‌ల‌సీమ రాజ‌స్థానే.. నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Nara Lokesh: Nara Lokeshఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలను చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల ఉరవకొండలో నిర్వహించినటువంటి శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోకేష్ వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

వచ్చే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాయలసీమ కాస్త రాజస్థాన్ గా మారుతుందని ఈయన కామెంట్లు చేశారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తాము అన్న ధీమా వారిలో లేకపోవడంతో అందిన కాడికి దోచుకుంటున్నారని లోకేష్ విమర్శలు కురిపించారు. నకిలీ ఆధారాలతో కొండలు గుట్టలను మాయం చేస్తూ పెద్ద ఎత్తున భూ కబ్జాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

గత ఎన్నికలలో జగన్ రెడ్డికి కేవలం రాయలసీమ నుంచి దాదాపు 53 ఎమ్మెల్యేలను గెలిపించారు అయితే రాయలసీమకు ఆయన చేసింది ఏంటనే ప్రశ్నించారు. బాబు గారి హయాంలో వేల సంఖ్యలో ఇండ్లు ఇచ్చామని తెలిపారు. పయ్యావుల కేశవ్ డ్రిప్ ఇరిగేషన్ తీసుకువస్తే జగన్మోహన్ రెడ్డి దానిని పూర్తి చేయలేకపోయారని లోకేష్ వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సీమ మొత్తం కరువుతో నిండిపోయిందని తాగడానికి కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చెరువును నీటితో నింపుతామని లోకేష్ హామీ ఇచ్చారు. మెగా డ్రిప్ ఇరిగేషన్‌ పూర్తి చేసి ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తామని… హామీ ఇచ్చారు. ఇలా రాయలసీమలో సాగునీరు లేక భూములు బీడుబారిపోయి ఉండడం గతుకుల రోడ్లు తాగడానికి మంచినీళ్లు లేనటువంటి పరిస్థితులను చూస్తుంటే గుండె బరువెక్కి పోతుందని లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -