Nara Lokesh: అప్పులు తేవడంలో జగన్ పీహెచ్డీ చేశారు.. నారా లోకేశ్ కామెంట్లు వింటే షాకవ్వాల్సిందే!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిపాలన పక్కన పెట్టి అప్పులు తేవడంలో జగన్ రాటు తేలిపోయారని అప్పులు తీసుకురావడంలో ఈయన పీహెచ్డీ చేశారు అంటూ నారా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా ఈయన ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

రాష్ట్ర పరిపాలన కేంద్రం అయినటువంటి సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా 370 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని ఈయన తెలిపారు. ఖనిజ సంపద తాకట్టు పెట్టి 7వేల కోట్ల రూపాయలను తీసుకున్నారని, మందు బాబులను తాకట్టు పెట్టి 33 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాలనలో మిగిలినది కేవలం ఐదు కోట్ల మంది ప్రజలు మాత్రమే అని లోకేష్ విమర్శలు చేశారు.

ఇలా రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పులలో ముంచినటువంటి ఆయన ఇప్పటికీ నేను మీ బిడ్డను అంటూ వేదికలపై ఊదరగొడుతున్నటువంటి జగన్ మాటలు వెనుక ఉన్న ఆంతర్యం గుర్తించి రాబోయే రెండు నెలలలో ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలని లోకేష్ తెలిపారు. ఇలా ఈయన జగన్ రెడ్డి గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన కంపెనీలన్ని కళకళలాడుతున్నాయి. అంతేకాని రాష్ట్రానికి కొత్త కంపెనీలను తెచ్చి నిరుద్యోగకు ఉపాధి అవకాశాలు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. ఇలా కంపెనీలను తీసుకురావడం చేతకాని ఈయనకు అప్పులు చేయడంలో మాత్రం పీహెచ్డీ చేశారు అంటూ జగన్ పై లోకేష్ ఆరోపణలు చేస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -