Nara Lokesh: మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో లోకేశ్ ఎమ్మెల్యే కావడం ఖాయమా.. వైసీపీ ఓటమికి సిద్ధమైపోవాలా?

Nara Lokesh: ప్రతీ ఎన్నికల్లో కొన్ని హాట్ నియోజకవర్గాలు ఉంటాయి. ఏపీలో అలాంటి నియోజకవర్గాలలో మంగళగిరి ఒకటి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఎప్పుడూ షాక్ తగులుతూనే ఉంది. అలాంటి స్థానంలో నారాలోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి నారాలోకేష్ వ్యూహాత్మకంగా పెద్ద తప్పు చేశారని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత టీడీపీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉండాల్సిన వ్యక్తి ఓటమితో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని విమర్శించారు. అయితే, ఈజీగా గెలిచే స్థానం నుంచి పోటీ చేస్తే నాయకత్వం లక్షణాలు బలపడవని.. ఎప్పుడూ గెలవని సీటును పార్టీకి గిఫ్టుగా ఇవ్వాలని ఛాలెంజ్ గా తీసుకొని మంగళగిరిలో పోటీ చేశారు. కానీ, తొలి ఎన్నికలో ఆయనకు చుక్కెదురైంది. అయినా.. లోకేష్ ఓటమికి భయపడకుండా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలపరిచేందకు శాయశక్తలు కృషి చేస్తున్నారు.

ఐదేళ్లు తిరిగే లోపు మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా? అనే దగ్గర నుంచి లోకేష్ మెజార్టీపై బెట్టింగులు వేసే స్థాయికి చేరారు. అయితే.. దాని కోసం ఆయన స్థానికంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నియోజకవర్గంలో సాయంత్రం సమయంలో వృద్దులు కూర్చోవడానికి సొంతనిధులతో రెండు పార్కులను అభివృద్ధి చేశారు. లోకేష్ కార్యక్రమాల ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. రెండు నెలల్లో మంగళగిరిలో వైసీపీ ముగ్గురు అభ్యర్థులను మార్చింది. మొదట ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేరును పరిశీలించారు. అయితే, అక్కడ బీసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. అయితే.. బీసీలు కూడా టీడీపీకే జై కొడుతున్న పరిస్థితి ఉండటంతో మళ్లీ పేరు మార్చారు. మహిళ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొని వచ్చి మురుగుడు లావణ్యను బరిలో దించుతున్నారు.

లోకేష్ మాత్రం అక్కడ వైసీపీ అభ్యర్థితో సంబంధం లేకుండా భవిష్యత్ లో తన ఏవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానో చెబుతున్నారు. మంగళగిరిని ఐటీ హబ్ చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలా మారుస్తానని చెప్పారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే చాలా కంపెనీలు మంగళగిరికి తీసుకొని వచ్చానని ఆయన గుర్తు చేశారు. తాను మంగళగిరిలో పోటీ చేస్తాననే ఆలోచన లేనప్పుడే ఇక్కడి ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చానని చెప్పారు. భవనాలు నిర్మించి, రాయితీలు ఇచ్చి కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు. హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు విజయవాడకు వచ్చాయని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక్కడే బంగారం తయారీ, నగల డిజైనింగ్ ఉత్పత్తి జరిగేలా చూస్తామని అన్నారు. రెండు వేల కోట్లతో నియోజవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆళ్ల రామకృష్ట ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పక్కనే ఉన్న కృష్ణానది నీటిని కూడా నియోజకవర్గంలోకి తీసుకు రాలేకపోయారని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

లోకేష్ తో పాటుమరోవైపు బ్రాహ్మిణి కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. దీంతో.. మంగళగిరిలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. తండోపతండాలుగా వైసీపీ క్యాడర్ టీడీపీలో చేరుతున్నారు. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పా వైసీపీలో మరెవరూ ఉండరా? అనేలా పరిస్థితి తయారైంది. ఓడిపోతేనే లోకేష్ సంక్షేమం, అభివృద్ధి చేస్తే… గెలిస్తే మరెంత అభివృద్ధి చేస్తారో అని స్థానిక ప్రజలు ఆలోచించేలా చేశారు. దీంతో.. వైసీపీ క్యాడర్ టీడీపీ గూటికి చేరుతున్నారు. దీంతో లోకేష్ మెజార్టీపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -